ప్రస్తుత సమాజంలోని ప్రజలందరూ చాలా రకాల చెప్పులను ధరిస్తూ ఉంటారు.ఇప్పటి కాలంలో చాలామంది ప్రజలు రకరకాల వెరైటీ చెప్పులను కూడా కాళ్లకు ధరిస్తూ ఉంటారు.
సామాన్య ప్రజలు వారి స్తోమతను బట్టి సాధారణ చెప్పులు ఉపయోగిస్తే, సెలబ్రిటీలు ధరించే చెప్పుల ధరలు లక్షల్లో కూడా ఉంటాయి.
నేటి కాలంలో కొంతమంది డాక్టర్ల సలహా మేరకు కూడా చెప్పులను ధరిస్తూ ఉన్నారు.
అయితే వాస్తవానికి వారంలో ఒక రోజు కనీసం ఒక కిలోమీటర్ దూరం చెప్పుల్లేకుండా నడవడం వల్ల మన శరీరానికి అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
వారానికి ఒక రోజు ఒక కిలోమీటర్ దూరం మేర చెప్పుల్లేకుండా నడిస్తే అనేక లాభాలను పొందవచ్చు.
దీంతో శరీర భంగిమ సరిగ్గా ఉంటుంది.పొత్తి కడుపుపై ఒత్తిడి కలిగి జీర్ణ క్రియ సక్రమంగా ఉంటుంది.నేల పై చెప్పులు లేకుండా నడవడం ద్వారా, ఇసుక, చిన్న చిన్న రాళ్లు కాళ్లకు సుతిమెత్తగా కుచ్చుకోవడం ద్వారా, మీ బీపీ కంట్రోల్ అవుతుంది.
రక్తప్రసరణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.ఇలా చేయడంవల్ల సహనం పెరుగుతుంది.ఏదో కొత్త స్పర్శను కాలి పాదాలు పొందడం వల్ల ఒత్తిడి కూడా తగ్గిపోతుంది.మానవుని పాదాల్లో 72వేల నరాలు ఉంటాయి.
ఎక్కువసేపు పాదరక్షలు వాడటం వల్ల సున్నితమైన ఈ నరాలు చచ్చుబడిపోతాయి.
చెప్పుల్లేకుండా నడవడం వల్ల అవి యాక్టివ్ గా ఉంటాయి.
దీంతో అనేక రకాల వ్యాధులు తగ్గుతాయి.ఆక్యుపంక్చర్ వైద్య విధానంలో కనుక వారంలో కనీసం ఒక రోజు అయినా సరే ఒక కిలో మీటర్ దూరం మేర చెప్పులు వేసుకోకుండా నడవాడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.
అన్ని విధాలుగా ఆరోగ్యనికి చాలా మంచిది.