అన్ స్టాపబుల్‌ షూటింగ్‌ షురూ.. మొదటి గెస్ట్‌ ఎవరు?

నందమూరి బాలకృష్ణ అభిమానులతో పాటు ఓటీటీ ప్రేక్షకులు అంతా ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 కి సంబంధించిన అప్డేట్ ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.మొన్నటి వరకు గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ లో పాల్గొన్న బాలకృష్ణ ఇటీవల హైదరాబాద్ లో అన్ స్టాపబుల్ షో కి సంబంధించిన షూటింగ్ లో పాల్గొన్నట్లు ఆయన సన్నిహితుల ద్వారా సమాచారం అందుతుంది.

 Balakrishna Unstoppable Season 2 Update Deails, Unstoppable With Nbk2, Aha Unsto-TeluguStop.com

అయితే ఇప్పటి వరకు ఎపిసోడ్ లో సంబంధించిన షూట్ ప్రారంభం అవ్వలేదని ప్రస్తుతం షూట్ జరుగుతున్నది ప్రోమో కోసం మాత్రమే అంటూ ఆహా టీం అధికారికంగా ప్రకటించారు.

ఇక ఈ సీజన్ 2 కోసం ఆహా వారు బాలకృష్ణ పై ఒక ప్రత్యేక సాంగ్ చిత్రీకరిస్తున్నట్లుగా ఇటీవల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది, కానీ ఆ వార్తలు నిజం కాదని బాలకృష్ణ పై కేవలం టీజర్ మాత్రమే చిత్రీకరిస్తున్నట్లుగా పేర్కొన్నారు.

టీజర్ కోసం మూడు నుండి నాలుగు రోజుల సమయం లో బాలకృష్ణ కేటాయించినట్లుగా సమాచారం అందుతుంది.రెండు మూడు టీజర్ లు షూట్ చేస్తారట.టీజర్లకే అంత సమయం కేటాయించడం ఏంటో అంటూ ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Unstoppablenbk, Aha Unstoppable, Balakrishna, Chiranjeevi, Telugu-Movie

ఇక బాలకృష్ణ మరియు ఆహా టీం వారు అన్ స్టాపబుల్ సీజన్ టు యొక్క మొదటి గెస్ట్ ఎవరు అనే విషయంలో చర్చలు జరుపుతున్నారని, అతి త్వరలోనే ఆ విషయమై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ గెస్ట్ గా వస్తే బాగుంటుంది అంటూ అందరూ కోరుకుంటున్నారు.గాడ్‌ ఫాదర్‌ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చిరంజీవి అన్‌ స్టాపబుల్‌ లో కనిపిస్తే బాగుంటుందని అంతా భావిస్తున్నారు.

మరి అది సాధ్యమయ్యేనా కాదా అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube