టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సలార్.
ఈ సినిమా కు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఇది ఇలా ఉంటే ఈ సలార్ సినిమాకు లీకుల బెడద తప్పడం లేదు.చిత్ర బృందం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక విషయం లీక్ అవుతూనే ఉంది.
ఈ నేపథ్యంలో ఇటీవలే ప్రభాస్ సెట్ లో పాల్గొన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.ఈ విషయం కాస్త డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దృష్టికి వెళ్లడంతో ఆయన తీవ్ర స్థాయిలో మండి పడ్డారట.
భారీ బడ్జెట్ తో తెరరకెక్కిస్తున్న సినిమా కావడంతో చిత్ర బృందం మొత్తానికి ప్రశాంత్ నీల్ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.దీంతో నటీనటులు, సాంకేతిక నిపుణులు సెట్స్‌లోకి మొబైల్ తీసుకురావొద్దు అని ప్రశాంత్ నీల్ ఆదేశించారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇందులో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో పృథ్వీరాజ్, సుకుమార్, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమాను ఏడాది సెప్టెంబరు 28న విడుదల చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇకపోతే ఈ లీకుల విషయంలో గతంలో రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విషయంలో కూడా ఇలాగే కఠిన నిర్ణయం తీసుకున్నారు.ప్రభాస్ విషయానికి వస్తే.ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.అలాగే ప్రభాస్ స్పిరిట్,ప్రాజెక్ట్ కె ఇలాంటి సినిమాలు నడుస్తూ బిజీ బిజీగా ఉన్నారు.దర్శకుడు మారుతి దర్శకత్వంలో కూడా ఒక సినిమాను చేయబోతున్నాడు ప్రభాస్.







