రాజస్థాన్లో కాంగ్రెస్ సంక్షోభం పంచాయతీ ఢిల్లీకి చేరింది.ఈ క్రమంలో సోనియాగాంధీతో పరిశీలకులు భేటీ కానున్నారు.
ప్రస్తుతం రాజస్థాన్ లో నెలకొన్న పరిణామాలపై సోనియాగాంధీకి రాతపూర్వకంగా నివేదిక అందించనున్నారు.అయితే రాజస్థాన్ పరిస్థితులపై సోనియా ఇప్పటికే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఓ వైపు సీఎం గెహ్లాట్ ను బుజ్జగించే పనిని కమలనాథ్ కు అప్పగించింది పార్టీ అధిష్టానం.కానీ, అసలు ఏఐసిసి అధ్యక్షుల రేసులో గెహ్లాట్ ఉంటారా.? లేదా అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.ఈ విషయంపై కాంగ్రెస్ హై కమాండ్ త్వరలో క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.







