ఆంధ్రప్రదేశ్ లో ఒక హిట్లర్, ఒక తుగ్లక్, ఒక గోబెల్స్ లకు ప్రతిరూపం అయిన పరిపాలన సాగుతుంది.సంఖ్యాబలంతో ప్రభుత్వం పార్లమెంటరీ సాంప్రదాయాలను, పద్దతులను, చట్టాలను కాలరాసి ఇష్టానుసారం నిరంకుశ పాలన సాగిస్తున్నారు.
అధికారం గర్వంతో, లెక్కలేని తనంతో, విధ్వంస పాలన చేస్తూ, పేర్లు మారుస్తూ, రంగులు వేస్తూ ,ప్రజల సంపదను దోపిడీ చేస్తూ,ప్రతిపక్షాల పై అక్రమ కేసులు బనాయిస్తూ రాక్షస పాలన సాగిస్తున్నారు.గర్వంతో, లెక్కలేని తనంతో విర్రవీగుతూ తానూ చేసిందే నీతి అని, తానూ చేసేదే న్యాయం అని వితండవాదం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నియంతలకే నియంతగా వ్యవహరిస్తున్నారు.గత ప్రభుత్వ కట్టడాలు కూల్చడం,రంగులు వేయ్యడం, పేర్లు మార్చడం పిచ్చి పరాకాష్టకు చేరింది.
జగన్ రెడ్డికి పేర్లు పిచ్చి పీక్ కి చేరి ఏది కనిపిస్తే దానికి వైసిపి రంగులు వెయ్యడం,తన పేరో, తండ్రి వైఎస్ పేరో పెడుతున్నారు.
తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్ఠీఆర్ విశ్వవిద్యాలయం పేరు మార్చి తన మరుగుజ్జు నాయకత్వాన్ని జగన్ మరోసారి బయట పెట్టుకొన్నారు.
మూడున్నరేళ్ళలో జగన్ తీసుకొన్న తుగ్లక్ నిర్ణయాలలో ఎన్ఠీఆర్ పెరు మార్చడం ప్రధాన మైనది.ఇటువంటి నిరంకుశ,స్వార్ధ పూరిత పరిపాలన భారత దెశ చరిత్ర లో ప్రజలు చూసారా? ఎన్ఠీఆర్ పుట్టుక విశిష్టమైనది, విలక్షణ మైనది,మహోన్నత మైనది.ఒక సామాన్య రైతు కుటుంభంలో జన్మిoచి కళారంగంలో విశ్వ విఖ్యాత నటసార్వభౌముడిగా వెలుగొంది, రాజకీయ సంస్కర్తగా తెలుగుజాతి హృదయాలలో చిరస్థాయిగా నిలిచి పోయిన మహోన్నత నాయకుడు.అటువంటి నాయకుడు పేరు ఎన్ఠీఆర్ హెల్త్ యూనివర్సిటీ కి పేరు జరిగింది.
వైద్య విద్యకు ప్రత్యేక యూనివర్సిటీ వుండాలని,వైద్య విద్య ప్రమాణాలు పెంచాలనే ఆలోచనతో 36 ఏళ్ల క్రితం ఎన్ఠీఆర్ ప్రారంభించారు.

కానీ ఆయన తన పేరు పెట్టుకోలేదు.ఆయన మరణానంతరం వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్ఠీఆర్ పెట్టారు చంద్రబాబు.జగన్ పరిపాలన చూసిన వారందరు ముమ్మాటికీ తుగ్లక్ పరిపాలన అని సంభోదిస్తున్నారు.
తుగ్లక్ రాజధానిని మార్చిన ఉదంతాన్ని గుర్తుచేసుకొంటున్నారు.ఆనాడు తుగ్లక్ కూడా రాజధానిని మార్చడం,తానూ అనుకొన్నదల్లా చేసి ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు.
తుగ్లక్ ఏ విధంగా మోడీగా నిర్ణయాలు తీసుకున్నాడో నేడు జగన్ రెడ్డి కూడా తుగ్లక్ పాలనను తలపిస్తూ రాష్ట్ర భవిష్యత్ ను బలిపెడుతున్నారు.ఏది ఏమైనా ఎన్ఠీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్చడం జగన్ రెడ్డి రాక్షస రాజకీయాలకు నిదర్శనం.
పక్షపాతం గాని,రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని,శాసనాన్ని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా చేసిన ప్రమాణాన్ని జగన్మోహన్ రెడ్డి ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి.







