యాదాద్రి జిల్లా:తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటం గ్రామంలోని ఆమె విగ్రహానికి మునుగోడు కాంగ్రేస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ధీర వనిత,మహిళా లోకానికి స్ఫూర్తి ప్రధాత,ధిక్కార స్వరానికి నిలువుటద్దమని కొనియాడారు.భూమి కోసం,భుక్తి కోసం,బానిస సంకెళ్లు నుండి విముక్తి కోసం జరిగింది సాయుధ పోరాటమైతే అందులో తెలంగాణ నిప్పుకణికగా నిలిచింది చాకలి ఐలమ్మ అని గుర్తు చేశారు.
ఆడది అబల కాదు సబల అని నిరూపించి,దాస్య విమోచన కోసం భూస్వాములతో పోరాడి అమరత్వం పొందిన ధీశాలి ఐలమ్మ అని, ఆమె పోరాట వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని నేటి మహిళలు హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.







