రైతుల కోసం సామాజిక కార్యకర్తల పాదయాత్ర

సూర్యాపేట జిల్లా:రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ నేరేడుచర్లకు చెందిన సామాజిక కార్యకర్తలు సుంకరి క్రాంతి కుమార్, జింకల భాస్కర్, కొప్పు రామకృష్ణ, చింతల శ్రవణ్ మండలంలోని సోమవారం గ్రామ సోమప్పసోమేశ్వర ఆలయం వరకు పాదయాత్ర చేసి, రైతుల కొరకు ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ రైతులకు గత రబీ, ఖరీఫ్ పంటలలో ఎన్నో అవంతరాలు ఏర్పడి పంట నష్టపోయారన్నారు.

 Social Workers March For Farmers-TeluguStop.com

ప్రస్తుతం మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గండిపడి దాదాపు 15 రోజులు నీరు రాక,వేసిన వరి పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు.పంటలు నష్టపోయి ఇక వ్యవసాయమే దండగనే స్థాయికి వెళ్లిన రెత్తుల కష్టాలను ఆ భగవంతుడే తీర్చాలని కోరుతూ ప్రసిద్ధి కాంచిన సోమప్ప సోమేశ్వర ఆలయం వరకు పాదయాత్ర చేశామన్నారు.

రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని, పదిమందికి అన్నం పెట్టే రైతు ఎప్పుడూ చల్లగా ఉండాలని, రైతులు వేసిన పంటలు బాగా పండి, పండిన పంటకు మంచి గిట్టుబాటు ధర రావాలని ఆ భగవంతున్ని వేడుకున్నట్లు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube