ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు పై తీవ్ర దుమారం రేగుతున్న విషయం తెలిసిందే.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని కాస్త వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా పేరు మార్చడంతో ఇది తీవ్ర చర్చలకు దారితీస్తుంది.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ నేతలు అలాగే ఎన్టీఆర్ అభిమానులు వైసీపీ ప్రభుత్వాన్ని తప్పుపడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే నందమూరి హీరోలు అయినా కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్,బాలకృష్ణ, నారా రోహిత్ లు స్పందించిన విషయం తెలిసిందే.
ఇది బాలకృష్ణ వ్యాఖ్యలపై వైయస్సార్ సిపి నేతలు ముకుమ్మడిగా దాడి చేస్తున్నారు.కిందిస్థాయి నేతల నుంచి మంత్రుల వరకు ప్రతి ఒక్కరు కూడా బాలయ్య బాబుని టార్గెట్ చేస్తూ విమర్శలను గుర్తిస్తున్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా తన తండ్రి పై వస్తున్న విమర్శలకు నందమూరి మోక్షజ్ఞ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు.వాళ్లు ఎంత చేసినా కూడా బాలయ్య వెంట్రుక కూడా పీక్కోలేరు అంటూ మోక్షజ్ఞ ఫైర్ అయ్యాడు.
బాలయ్య మీద గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మొరుగుతున్న కొన్ని కుక్కలకు మీరు ఎంత చేసినా బాలయ్య వెంట్రుక కూడా పీక్కోలేరు.

మీరు అవసరం ఉన్నప్పుడు ఆయన కాళ్ళ దగ్గరకు వచ్చిన వారే.అవసరం తీరిపోయిన తర్వాత కారు కూతులు కూస్తే కాలమే సమాధానం చెబుతుంది అంటూ మోక్షజ్ఞ ట్వీట్ చేశాడు.అలాగే ఎన్టీఆర్ పేరు అన్నది తీసేయడానికి అది పేరు మాత్రమే కాదు ఒక సంస్కృతి ఒక నాగరికత.
తెలుగు జాతి వెన్నెముక. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు.
కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరును మారుస్తున్నాడు.ఇక మిమ్మల్ని మార్చడానికి ప్రజలు ఉన్నారు, పంచభూతాలు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త.
అంటూ బాలయ్య బాబు తీవ్ర విమర్శలను గుర్తించిన విషయం మనందరికీ తెలిసిందే.







