పీఎఫ్ఐ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది.జాతీయ దర్యాప్తు సంస్థ ఇచ్చిన సమాచారంతో పీఎఫ్ఐ ఫండ్స్ పై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు.
ఈ నేపథ్యంలో గల్ఫ్‌లోనూ వేల సంఖ్యలో పీఎఫ్ఐ కార్యకర్తలు ఉన్నట్లు గుర్తించారు.విదేశాల్లోనూ స్వచ్ఛంద సంస్థ పేరుతో నిధులు వసూలు చేసి.
ఫండ్స్ ను భారత్‌లో ఉన్న పీఎఫ్ఐ కార్యకర్తలకు హవాలా ద్వారా ట్రాన్స్ఫర్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.రూ.120 కోట్లకు సంబంధించి ఈడీ కూపీ లాగుతోంది.ప్రపంచ వ్యాప్తంగా తేజస్ పేపర్‌ను నడిపిస్తున్న పీఎఫ్ఐ.
తేజస్ కు వచ్చిన డొనేషన్ అంటూ ఫేక్ రిసిప్ట్లు చూపిస్తుందని తెలిపారు.ఈ క్రమంలో తేజస్ కు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న పీఎఫ్ఐ నాయకుడు షఫిక్ ను మూడు రోజుల క్రితం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.







