టీడీపీ అధినేత చంద్రబాబుపై వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ఎన్టీఆర్ పై చంద్రబాబు ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్నారని అన్నారు.
ఎన్టీఆర్ పదవి లాక్కుని ఆయనను మానసిక క్షోభ పెట్టింది నిజం కాదా అని మంత్రి ప్రశ్నించారు.చంద్రబాబు అంటేనే వెన్నుపోటుకు పెట్టింది పేరని ఆమె వ్యాఖ్యనించారు.
వైద్య రంగంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నో సేవలందించారని తెలిపారు.వైఎస్ఆర్, జగన్ లు రాష్ట్రానికి 20 మెడికల్ కాలేజీలు తెచ్చారని చెప్పారు.
అందుకే హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టామని మంత్రి విడదల రజని స్పష్టం చేశారు.







