2024 ఎన్నికలపై టీడీపీకి చాలా అంచనాలే ఉన్నాయి.తప్పకుండా తాము అధికారంలోకి వస్తామనే నమ్మకంతో ఆ పార్టీ అగ్రనేతలు ఉన్నారు.2019 ఎన్నికలలో వచ్చిన ఫలితాలు టిడిపిని పూర్తిగా నిరశపరచడంతో పాటు, ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఆ పరిస్థితిని కల్పించింది.అసలు మళ్లీ టిడిపి అధికారంలోకి వస్తుందా అనే అనుమానాలు కూడా మొదలవగా, చంద్రబాబు ఆ పరిస్థితి నుంచి కొద్ది నెలల్లోని అందర్నీ బయట పడేసారు.
నిత్యం అనేక ప్రజా పోరాటాలు, పార్టీ కార్యక్రమాలు చేపడుతూ పార్టీ నేతలు ఉత్సాహం పెంచారు.అలాగే మొదట్లో వైసీపీ ప్రభుత్వానికి ఉన్నంత సానుకూలత ఇప్పుడు లేకపోవడం టిడిపికి బాగా కలిసి వచ్చింది.
దీంతో టిడిపిలోను ఉత్సాహం పెరగడంతో పాటు , పార్టీ నాయకులంతా యాక్టివ్ అయ్యి ఏపీ ప్రభుత్వంపై పోరాటాలు చేపడుతున్నారు.
దీంతోపాటు వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను హైలెట్ చేద్దామన్నా, టిడిపి అనుసరించిన కొన్ని కొన్ని వ్యూహాత్మక తప్పిదాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.2019 ఎన్నికల్లో టిడిపి అతి విశ్వాసమే కొంప ముంచిందనేది ఆ పార్టీ నాయకులకు కూడా బాగా తెలుసు.ఇప్పుడు కూడా అదే స్థాయిలో ధీమాను వ్యక్తం చేస్తున్నారు.2024లో ఖచ్చితంగా టిడిపి అధికారంలోకి వస్తుందనే బలమైన వాదనను చంద్రబాబుతో పాటు , ఆ పార్టీ నాయకులు వినిపిస్తున్నారు తప్ప, క్షేత్రస్థాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఏ విధంగా ఉన్నాయనేది అంచనా వేయలేకపోతున్నారు .

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి ఘోరంగా ఫలితాలను చవిచూడాల్సి వచ్చింది.అలాగే చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనూ మున్సిపాలిటీ వైసీపీ తమ ఖాతాలో వేసుకుంది .ఇక ఏపీలో ఏ ఉప ఎన్నికలు జరిగినా, వైసిపి అభ్యర్థి గెలుస్తున్నారు.ఇక వైసిపి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై టిడిపి ఉద్యమాలు చేపడుతున్నా, వైసిపి దానిని తిప్పుకొట్టడంలో సక్సెస్ అవుతోంది.ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా నామకరణం చేస్తూ ఏపీ అసెంబ్లీలో బిల్ పాస్ చేసిన వ్యవహారంలోనూ వైసీపీని ఇరుకున పెట్టాలని చూసినా, చివరకు అది టిడిపికి ఇబ్బందులు తీసుకురావడంతో పాటు, గతంలో చంద్రబాబు కారణంగా ఎన్టీఆర్ ఎదుర్కొన్న ఇబ్బందులు ఇప్పుడు హైలెట్ అవడం వంటివన్నీ టీడీపీకి ఇబ్బందులు తెచ్చిపెట్టినవే.







