దేశంలోని నరేంద్ర మోడీ సర్కార్ అదానీ, అంబానీలతోపాటు కొందరు కార్పోరేటర్ల కోసమే పనిచేస్తున్నది దేశంలోని అన్ని విపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.వారి విమర్శలకు బలం చేకూరేలా కరోనా కష్టకాలంలోనూ ఏడాదికి ఏడాది అదానీ ఆదాయం, ఆస్తులు ఐదింతలు, పదింతలు పెరిగిపోతుంటే ఇతర కార్పోరేట్ కంపెనీల ఆస్తులు కూడా అమాంతంగా పెరిగిపోతున్నాయి.
విదేశాల్లో ములుగుతున్న నల్లధనంను నరేంద్రమోడీ తీసుకురాకపోగా పార్టీలకు విరాళాల రూపంలో అందుతున్న నల్లధనంను అరికట్టలేదన్నది వాస్తవం.నీతులు చెప్పేందుకు…పాటించేందుకు కాదు అని కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీరుంది.
ఇక పోతే రాజకీయపార్టీలకు అందుతున్న విరాళాల్లో 69 శాతం మేర ‘గుర్తు తెలియని’ దాతలవేనని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ 2017లో నివేదికలో స్పష్టంచేసింది.రాజకీయ పార్టీలు 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆదాయ పన్ను రిటర్నులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోందని ఏడీఆర్ పేర్కొంది.
2017–18 ఆర్థిక సంవత్సరంలో వేర్వేరు మార్గాల్లో ఆరు రాజకీయపార్టీలు అందుకున్న రూ.1293కోట్లల్లో 689 కోట్లు గుప్త నిధులే.ఇందులో సింహభాగం అంటే రూ.1027కోట్లతో బీజేపీ అగ్రస్థానంలో నిలిచింది.అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ళకాలంలో బీజేపీ ఆదాయం దాదాపుగా రెట్టింపైతే, ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ ఆదాయం తగ్గిపోతూ వచ్చింది.మిగతా పార్టీలన్నీ బీజేపీకి ఆమడదూరంలో ఉన్నాయి.2018వ ఆర్థిక సంవత్సరంలో బీజేపీ మిగతా ఐదుపార్టీల సగటుకంటే నాలుగురెట్లు అధికంగా గుప్త నిధులను అందుకున్నది.20వేల లోపు విరాళాలకు, ఎన్నికల బాండ్ల ద్వారా సేకరించిన సొమ్ముకు పార్టీలు దాతల వివరాలు బయటకు చెప్పనక్కరలేదు.కనుక నిధుల్లో సగానికిపైగా ఈ కోటాలో పోతున్నాయి.

అధికారంలో ఉన్నది కనుక 2013–14లో రూ.674కోట్ల ఆదాయం ఉన్న బీజేపీ 2017–18 కాలానికి 1027కోట్లకు పెరగడం, ఇదే కాలంలో అధికారంలో లేని కాంగ్రెస్ ఆదాయం 598కోట్లనుంచి రూ.199కోట్లకు పడిపోయింది.2017–18 కాలానికి ఎన్నికల బాండ్ల ద్వారా పార్టీలకు సమకూరిన రూ.215కోట్లలో సైతం బీజేపీదే అగ్రస్థానం.ఇదిలావుంటే ఇదిలావుంటే గత ఏడాది సార్వత్రిక ఎన్నికల సమయంలో 7 జాతీయ, 25 ప్రాంతీయ పార్టీలు కలిపి రూ.6,405.59కోట్ల విరాళాలు వసూలు చేసినట్లు తేల్చింది.వచ్చిన విరాళాల్లో బీజేపీకి రూ.1,141.72 కోట్లు, కాంగ్రెస్ రూ.626 కోట్లు, వైసీపీ రూ.85 కోట్లు, టీడీపీ రూ.79.26 కోట్లు ఖర్చుచేశాయంటా.







