తెలంగాణా ప్రజలకు అతి పెద్ద పండుగ, తెలంగాణా సంస్కృతిని చాటి చెప్పే గొప్పదైన పండుగ బతుకమ్మ.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మ పండుగకు మరింత ప్రాసిస్త్ర్యం పెరిగింది.
కేవలం తెలంగాణలో ఉండే ప్రజలు మాత్రమే కాదు ప్రపంచ నలుమూలల ఉండే తెలంగాణా ప్రవాసులు ప్రతీ ఒక్కరూ బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నారు.ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అతి పెద్ద తెలుగు సంస్థగా పేరొందిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా ) బతుకమ్మ వేడుకలను అగ్ర రాజ్యం అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది.
హార్ట్ ఆఫ్ ది యూనివర్స్ గా పేరొందిన న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద బతుకమ్మ పండుగను అక్టోబర్ 8 న నిర్వహించబోతోంది.ఈ పండుగను భారీ స్థాయిలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.
బతుకమ్మ పండుగను యావత్ ప్రపంచం చూసేలా, చర్చించుకునేలా , తెలంగాణా వాసులు, తెలుగు ప్రజలు గర్వపడేలా నిర్వహిస్తామని తానా ప్రకటించింది.అలాగే ఎంతో మంది కళాకారులు, కవులు, రచయితలకు ఆహ్వానం పలుకుతోంది.
బతుకమ్మని ఎంతో అందంగా ముస్తాబు చేసుకుని పూజలు చేద్దాం కీర్తిద్దాం, ఆట పాటలతో పూజించుకుందాం తెలుగు వారందరూ విచ్చేయండి అంటూ ఆహ్వానం అందిస్తోంది.అంతేకాదు.

అమెరికా లోని ఏ ప్రాంతం నుంచైనా న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్దకు రావాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలిపింది.ఇక ఈ వేడుకల కోసం ప్రఖ్యాత యాంకర్ అనసూయ, తెలంగాణా బాష ఉట్టిపడేలా పాటలు పాడుతూ అలరిస్తున్న సింగర్ మంగ్లీ రానున్నట్టుగా తెలుస్తోంది.అక్టోబర్ 8 న సాయంత్రం 3.30 గంటలకు వేడుకలు ప్రారంభమవుతాయని తానా తెలిపింది.ఇదిలాఉంటే బస్సులలో రావాలనుకునే వారు తప్పనిసరిగా క్రింద ఇవ్వబడిన లింక్ ను తెరిచి అందులోని ఫాం ను పూర్తి చేసి పంపాల్సిందిగా తెలిపింది.







