అల్లు అర్జున్ సినిమా ఇద్దరమ్మాయిలు సినిమా తో తెలుగు లో మంచి గుర్తింపును దక్కించుకున్న ముద్దుగుమ్మ అమలా పాల్.ఈ అమ్మడు గత కొంత కాలంగా పూర్తిగా తమిళ సినిమా పరిశ్రమకే పరిమితమైంది.
తెలుగు లో ఒకటి రెండు చిన్న వెబ్ సిరీస్ ల్లో నటించిన కూడా ఎక్కువ శాతం తమిళనాటనే సినిమాలు చేయాల్సి వస్తుంది.హిందీలో కూడా ఈమె ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తుంది.
భర్త నుండి విడి పోయిన తర్వాత ఈమె పూర్తిగా సినిమాల విషయం లో వెనుక పడిపోయింది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కానీ ఆమె మాత్రం మళ్లీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
తెలుగు లో అవకాశాలు దక్కించుకోవడం కోసం ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.
మరో వైపు అందాల ప్రదర్శన చేస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.
తాజాగా ఇలా బికినీ ఫోటో షూట్స్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి తెలుగు ఫిలిం మేకర్స్ యొక్క దృష్టి ని ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.అందాల ఆర బోత విషయం లో తాను ఇప్పటికీ కూడా తగ్గేదిలే అన్నట్లుగా ఇలా అందాలను చూపిస్తానంటూ ఫోటోలతో ఆమె చెప్పకనే చెబుతోంది.

ముద్దు గుమ్మ అందాల విందు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.పెద్ద ఎత్తున ఫోటో షూట్ మరియు వీడియో లు ఈమె షేర్ చేస్తూ ఉండడం తో ఎప్పటికప్పుడు అభిమానులు ఆమె పై అభిమానాన్ని పెంచుకుంటున్నారు.ఈమె తెలుగు లో స్టార్ హీరో లకు జోడి గా నటిస్తే బాగుంటుంది అంటూ ఫోటోలు చూసినా అభిమానులు కోరుకుంటున్నారు, కానీ తెలుగు లో మాత్రం అవకాశాలు రావడం లేదు.కనీసం ఈ ఫోటో లో చూసిన తర్వాత అయినా ఫిలిం మేకర్స్ తెలుగు లో ఆఫర్లు ఇస్తారేమో చూడాలి.







