కమూనిస్ట్ రాజకీయ నేపథ్యంతో వచ్చిన ఈటల రాజేందర్ ఆర్‌ఎస్‌ఎస్ సంస్కృతి, సంప్రదాయాలు ఎక్కువగా ఉండే బీజేపీతో సర్దుకులేకపోతున్నరనే వార్తలు వినిపిస్తున్నాయి.హార్డ్ కోర్ లెఫ్ట్ నేపథ్యానికి చెందిన ఈటల తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరి ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది.
ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న ఈటల మతతత్వ పార్టీ ఆయన బీజేపీలో ఫిట్ అవుతారా అని? చాలా మంది పలువురు అభిప్రాయపడ్డారు.టీఆర్ఎస్‌లో ముఖ్య నేతగా ఉండి పార్టీలో పలు బాధ్యతలు నేరవెర్చిన ఆయన బీజేపీలో సాధరణ ఎమ్మెల్యేగా ఉండలేకపోతున్నారట.
ఈటల మనసత్వం కాషాయ పార్టీకి సెట్ కాదని రాజకీయ విశ్లేషకులు మెుదటిలోనే అనుమానించారు.ఇప్పుడు ఆ అనుమానాలు నిజమవుతున్నాయి.
కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, డాక్టర్.కె.లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వంటి నేతలతో ఆయన పొసగలేకపోతున్నారనేది ఇప్పుడు బహిరంగ రహస్యం.ఈ ముగ్గురు నేతలు ఆయనకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని సన్నిహితులు చెబుతున్నారు.బండి సంజయ్ పార్టీలో తన టీమ్‌కు ప్రాధన్యత ఇస్తుండగా, లక్ష్మణ్ తన పాత స్నేహితులతోనే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
కిషన్ రెడ్డి వర్గం కూడా ఈటల నుండి సు దూరం పాటిస్తున్నట్లు కొన్ని వర్గాలు చెబుతున్నాయి.తనకంటే అనుభవజ్ఞుడైన ఈటల తనకు పోటీగా మారవచ్చని కిషన్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం.
ఈటల ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు మంత్రిగా పనిచేసిన ఈటల ఒక్కవేళ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సాధిస్తే ముఖ్యమంత్రి పదవికి ఈటల అడ్డువస్తడనే భావన కిషర్ రెడ్డిలో ఉన్నట్లు తెలుస్తోంది.

జాయినింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఈటల ఉన్నప్పటికీ బీజేపీలో చేరాలనుకునే నేతలను బండి సంజయ్ నేరుగా ఢిల్లీకి తీసుకెళ్తుతున్నారు.ఇది ఈటలకు పెద్ద సమస్యగా మారింది.ఈటాలాను లూప్‌లో ఉంచకుండానే ఇప్పటివరకు అనేక చేరికలు జరిగాయి.
బీజేపీ నేతలు ఆయన్ను దాటవేస్తున్నారనే భావన బలంగా ఉంది.అందుకే, ఈటల బీజేపీలో తనకు తానే ఫిట్‌గా లేరు.







