లోకేష్ పోటీ చేసేది మంగళగిరి కాదా .. ? కారణం ఇదేనా ?

ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు లందరికీ టిక్కెట్లు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.

అలాగే గుంటూరు జిల్లా నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఫైనల్ చేశారు.

ఈ లిస్ట్ లో మంగళగిరి నుంచి నారా లోకేష్ ఉన్నారు.ఆ లిస్టులోనే కాదు 2019 ఎన్నికల్లో లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందిన తరువాత కూడా మంగళగిరి నుంచి తాను మళ్లీ పోటీ చేస్తానని , ఇక్కడి నుంచే గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి తన సత్తా చాటుతాను అని ప్రకటించారు.

దీనికి తగ్గట్లుగానే ఈ నియోజకవర్గంలో సందర్భం వచ్చినప్పుడల్లా పర్యటిస్తున్నారు.పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఈ నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే దీనికి కౌంటర్ గా వైసీపీ సైతం ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.

Advertisement

ప్రస్తుతం మంగళగిరి నుంచి లోకేష్ పై విజయం సాధించిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు.ఈ నియోజకవర్గంలో పద్మశాలి సామాజిక వర్గం ఎక్కువగా ఉండడంతో,  ఆ సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకులందరికి అనేక నామినేటెడ్ పోస్టులను కేటాయించారు.

అలాగే టిడిపి,  ఇతర పార్టీల్లోని కీలక నాయకులనుకున్న వారిని వైసీపీలో చేర్చుకోవడంలో సక్సెస్ అయ్యారు.టిడిపి అధికార ప్రతినిధిగా,  మాజీ మున్సిపల్ చైర్మన్ గా ఉన్న గంజి చిరంజీవిని వైసీపీలో చేర్చుకున్నారు.

వీరితోపాటు అంతకుముందే టిడిపి సీనియర్ నేత మురుగుడు హనుమంతరావు , మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల వంటి వారిని వైసీపీలో చేర్చుకున్నారు.  రోజురోజుకు టిడిపి బలాన్ని తగ్గించి లోకేష్ ఓటమికి బాటలు వేసే విధంగా వైసిపి వ్యూహాలు రచిస్తుంది.

దీంతో లోకేష్ కాస్త ఆందోళనలోనే ఉన్నారట.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఈ నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గంలో తన గెలుపు పై సర్వే చేయించుకున్నట్లు సమాచారం.దీంతో పాటు హిందూపురం, విజయవాడ తూర్పు , పెనమలూరు,  విశాఖ సిటీ , భీమిలి వంటి నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో తనకు అనుకూల పరిస్థితులు ఉంటాయనే విషయంపై సర్వే చేయించుకున్నట్లు సమాచారం అవసరం అయితే హిందూపురం నుంచి తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తన మేనమామ బాలకృష్ణను ఎంపీగా పోటీ చేయించేందుకు లోకేష్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.అయితే చంద్రబాబు మాత్రం మంగళగిరి నుంచి పోటీ చేయించాలని చూస్తున్నా,  మరో ప్రత్యామ్నాయంగా ఇతర నియోజకవర్గాలను లోకేష్ ఆప్షన్ తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

Advertisement

     .

తాజా వార్తలు