ఫైనల్ గా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చిన లైగర్.. మరి ఇక్కడైనా..

ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయినా లైగర్ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది.ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించగా.

 Vijay Deverakonda-starrer Liger Ott Release Details, Vijay Deverakonda, Liger, P-TeluguStop.com

రిలీజ్ అయినా అన్ని చోట్ల ఒకే స్పందన వచ్చింది.ఫ్యాన్స్ ను మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులను కూడా ఏ విషయంలో సంతృప్తి పరచలేక పోయింది.

టాలెంటెడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమాను పూరీ కనెక్ట్స్ ఇంకా ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించగా ఇందులో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటించింది.మొదటిసారిగా పాన్ ఇండియా సినిమా చేస్తున్న విజయ్ ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా క్రేజ్ సొంతం చేసుకోవచ్చు అనుకున్నాడు.

ఇక ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి భారీ ప్లాప్ అందుకోవడంతో ఇప్పుడు ఓటిటి లో అయినా ఆకట్టు కుంటుందో లేదో అని విజయ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

Telugu Ananya Pandey, Bollywood, Disney Hot, Liger, Liger Ott, Puri Jagannadh-Mo

మరి ఈ సినిమా ఓటిటి లో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది.ఈ రోజు నుండే ఈ సినిమా ఓటిటిలో ప్రేక్షకులను అలరించనుంది.

ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

తెలుగు తో పాటు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉండగా.హిందీ వర్షన్ మాత్రం త్వరలో రిలీజ్ చేయనున్నారు.

మరి ఈ సినిమా థియేటర్స్ లో ఎలాగూ సందడి చేయలేక పోయింది.ఇక ఓటిటిలో అయినా సందడి చేస్తుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube