ప్రభుత్వ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న డాక్టర్లు, వైద్య సిబ్బందిని పోస్టులను భర్తీ చేయాలని ప్రగతిశీల యువజన సంఘం ( పీవైఎల్ ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఎస్ ప్రదీప్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారువర్షాకాలంలో ప్రతి ఏడాది సీజనల్ వ్యాధుల సోకి, ప్రజలు అవస్థలు పడాల్సి వస్తోందని, సీజన్ వ్యాధులను అరికట్టేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పి వై ఎల్ జిల్లా కోశాధికారి జె ప్రేమ్ సింగ్ అధ్యక్షతన కొనిజర్ల మండల కేంద్రంలో జరిగిన ప్రగతిశీల యువజన సంఘం PYL ఖమ్మం జిల్లా కమిటీ సమావేశంలో పి వై ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఎస్ ప్రదీప్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ.
పారిశుద్ధ్యం పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని కోరారు.పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం వల్లే దోమలు ఉత్పత్తి అయి డెంగ్యూ, మలేరియా వైరల్ జ్వరాలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు, ప్రతి ఏటా సీజనల్ వ్యాధులు, రోజుకొక కొత్త జబ్బు పుట్టుకొస్తుంటే వాటిని అరికట్టేందుకు సరైన సిబ్బంది లేక 5 సంవత్సరాలు కావస్తుందని విమర్శించారు.
గ్రామాలల్లో దోమల విరుగుడికి పాగింగ్ చర్యలు చేపట్టాలని, వీధులన్నీ శుభ్రపరచాలని, గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు.వైద్య ఆరోగ్యశాఖలో సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోని, వైద్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని జిల్లా వ్యాప్తంగా వైద్య సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ PYL-POW జిల్లా కమిటీ పిలుపులో భాగంగా ఈనెల 29న ఖమ్మం నగరంలో DMHO ఆఫీస్ ముందు నిర్వహించే ధర్నాకు ప్రదర్శనకు ప్రజలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో PYL ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.వి రాకేష్,PYL జిల్లా సహాయ కార్యదర్శి మోహన్ రెడ్డి, PYL జిల్లా నాయకులు గండికోట లక్ష్మణ్, బాలు, మామిడాల వెంకటేష్, చందు, తదితరులు పాల్గొన్నారు.







