'పొన్నియన్ సెల్వన్' తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెన్యూ ఫిక్స్!

కోలీవుడ్ లో ఇప్పటి వరకు 100 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ సినిమాలు చేయడానికి ఏ డైరెక్టర్ కానీ ఏ నిర్మాత కానీ ముందుకు రాలేదు.అయితే ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీ నుండి కూడా ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వస్తుంది.

 Date Locked For Ponniyin Selvan-1 Telugu Pre-release Event Details, , Telugu Pre-TeluguStop.com

అదే పొన్నియన్ సెల్వన్. ఈ సినిమాను తమిళ్ బాహుబలి అంటూ అక్కడి మీడియా ప్రచారం చేస్తుంది.

ఈ సినిమా బాహుబలి రేంజ్ లో ఉంటుంది అని రెండు పార్టులు కలిసి బాహుబలి కలెక్షన్స్ ను బీట్ చేస్తుంది అంటూ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై కొద్దిగా అంచనాలు అయితే ఏర్పడ్డాయి.ఈ సినిమాను మావెరిక్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్నాడు.

ఈయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా ఈ సినిమాను ఎప్పటి నుండో తెరకెక్కించాలి అని అనుకున్న ఇప్పటికి అది సాధ్యం అయ్యింది.

ఈ సినిమాలో చియాన్ విక్రమ్, హీరో కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య రే, శోభిత దూళిపాళ్ల వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాపై హైప్ ఏర్పడడంతో అందరు ఎలా ఉండబోతుందా అని ఎదురు చూస్తున్నారు.

Telugu Jayam Ravi, Karti, Kollywood, Mani Ratnam, Maverickmani, Ponniyin Selvan,

మరి కొద్దీ రోజుల్లో రిలీజ్ కాబోతున్న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు భారీగా ప్రొమోషన్స్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తెలుగులో కూడా వరుస ప్రొమోషన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.ఈ ప్రొమోషన్స్ లో భాగంగానే ఈ సినిమా కోసం తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించ బోతున్నట్టు తెలుస్తుంది.

హైదరాబాద్ లో పొన్నియన్ సెల్వన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 23న సాయంత్రం 5 గంటల నుండి JRC కన్వెన్షన్స్ లో జరగనుంది.ఇక సెప్టెంబర్ 30న రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube