గత కొంతకాలంగా వరుస చేరికలతో తెలంగాణలో బిజెపి బలపడుతూ వస్తోంది.2023 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బిజెపి టార్గెట్ విధించుకుంది దీనికోసం బిజెపి రాష్ట్ర నాయకులు నుంచి జాతీయ నాయకుల వరకు అంతా వరుసగా తెలంగాణలో అనేక కార్యక్రమాలు చేపడుతూ , టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత పెంచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు క్రమక్రమంగా బిజెపి తెలంగాణలో బలం పొందుకుంటూ ఉండడంతో టాలీవుడ్ ప్రముఖులు ఎంతోమంది ఇటీవల బీజేపీలో చేరారు అంతేకాకుండా ఎప్పుడు బిజెపికి దూరంగా ఉండి సినిమా రంగానికి చెందినవారు ఇప్పుడు బిజెపిలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.దీంతో తమ పార్టీలో సినిమా తారలు కూడా ఉంటే ఎన్నికల సమయంలో ప్రచారానికి ఉపయోగపడతారనే లెక్కలో ఉన్న బిజెపి సినిమా హీరోలు, ప్రముఖ నటులను బిజెపిలో చేర్చుకునే వ్యూహానికి తెరతీసింది. ఇప్పటికే సినీ నటుడు యంగ్ హీరో ఎన్టీఆర్ తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ కాగా, హీరో నితిన్ తో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నాడ్డా ఇంకా అనేకం మంది సినీ రంగానికి చెందిన వారితో బిజెపి నాయకులు చర్చలు జరుపుతున్నారు.
ఇప్పటికే జీవిత రాజశేఖర్ లు బిజెపిలో చేరడంతో పాటు, టిఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.ముఖ్యంగా లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత పేరు బయటకు వచ్చిన దగ్గర నుంచి జీవిత రాజశేఖర్ లు కవితని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తున్నారు.
బిజెపి అగ్ర నాయకుల దృష్టిలో పడి తమ ప్రాధాన్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.అయితే బిజెపి వైపు చూస్తున్నవారు, ఇప్పటికే పార్టీలో చేరిన వారంతా జూబ్లీహిల్స్ అసెంబ్లీ టికెట్ పైనే ఆశలు పెట్టుకోవడం, ఈ మేరకు బిజెపి రాష్ట్ర జాతీయ పెద్దలపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు.

జీవిత రాజశేఖర్ తో పాటు హీరో నితిన్ కుటుంబ సభ్యులు, అలాగే కార్తికేయ 2 నిర్మాత అభిషేక్ అగర్వాల్ తోపాటు, మరి కొంతమంది సినీ రంగానికి చెందినవారు జూబ్లీహిల్స్ టిక్కెట్ ఇవ్వాల్సిందిగా బిజెపిపై ఒత్తిడి చేస్తున్నారు.అయితే టిక్కెట్ల కేటాయింపు అంశం పూర్తిగా రాష్ట్ర నాయకత్వం చూసుకుంటుందని, కేంద్ర బిజెపి పెద్దలు చెబుతుండడంతో రాష్ట్ర నాయకత్వం దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.వీరే కాకుండా అనేకమంది పారిశ్రామికవేత్తలు, ఆర్థిక స్థితి మంతులు జూబ్లీహిల్స్ టికెట్ సంపాదించేందుకు గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో ఒత్తిడి పెంచుతున్నారట.
.






