ఇటీవల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ నటుడు కృష్ణంరాజు మరణించిన విషయం మనకు తెలిసిందే.ఇలా నటుడిగా సినిమా రంగంలో ఎన్నో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నటువంటి ఈయన కేవలం సినిమా పరిశ్రమలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా ఎన్నో సేవలు చేసి ఎంతో మంచి గుర్తింపు పొందారు.
ఈయన 83 సంవత్సరాల వయసులో కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను సందడి చేసినటువంటి కృష్ణంరాజు గుండెపోటు సమస్యతో మరణించిన విషయం తెలిసిందే.ఇకపోతే ఈ నెల చివరిన ఈయన సమారాధన సభ సొంత గ్రామం మొగల్తూరులో జరుగుతుంది.
ఈ సమారాధన కార్యక్రమానికి కృష్ణంరాజు కుటుంబ సభ్యులందరూ కూడా మొగల్తూరు వెళ్లి రెండు రోజులపాటు అక్కడే ఉండనున్నారు.కృష్ణంరాజు మరణించడంతో ఆయన సమారాధన కార్యక్రమం కోసం మైనపు విగ్రహాన్ని తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే కృష్ణంరాజు కుటుంబ సభ్యులు తన మైనపు విగ్రహాన్ని తయారు చేయించడం కోసం కొత్తపేటలో ఫేమస్ శిల్పి రాజ్ కుమార్ వడయార్ ను సంప్రదించారు.

కృష్ణంరాజు కుటుంబ సభ్యుల సూచనల మేరకు రాజ్ కుమార్ కృష్ణంరాజు మైనపు విగ్రహాన్ని తయారు చేసే పనిలోనే నిమగ్నం అయ్యారు.కృష్ణంరాజు దశదిన కార్యక్రమంలో శిల్పి రాజ్ కుమార్ వడయార్ మైనపు విగ్రహాన్ని కుటుంబ సభ్యులకు అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాజ్ కుమార్ మాట్లాడుతూ తనకు రెబల్ స్టార్ కృష్ణంరాజు అంటే ఎంతో ఇష్టమని ఆయన తన అభిమాన హీరో అని తెలిపారు.
ఆయన మరణం తనని బాధేస్తుందని అయితే కుటుంబ సభ్యుల కోరిక మేరకు తన మైనపు విగ్రహాన్ని కేవలం 4 రోజుల్లోనే తయారు చేస్తున్నట్లు తెలియజేశారు.








