గ్రాండ్ ఓల్డ్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఆ పార్టీకి గాంధీ కుటుంబ సభ్యులే నాయకత్వం వహిస్తున్నారు.ఇప్పటివరకు గాంధీ కుటుంబ సభ్యులే పార్టీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అయితే గత కొన్నేళ్ళుగా అధ్యక్షుడుని ఎన్నుకునే విధానంలో కొత్త పంథాను అనుసరిస్తు్న్నారు.ఈ సారి జరిగే అధ్యక్ష రేసులో హేమాహేమీలు తలపడే అవకాశం కనిపిస్తుంది.
గతంలో పార్టీలో విస్తృత మార్పులు చేయాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ అధక్ష్య ఎన్నికల్లో పోటీ సై అనడం అందరిలో ఆసక్తి రేపింది.సోమవారం తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసిన ఆయన తన ఆసక్తిని వెల్లడించినట్లు తెలుస్తోంది.
అలాగే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా అధ్యక్షుడిగా ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు.పార్టీ అధ్యక్ష ఎన్నికలలో ఈ ఇద్దరు కీలక నేతలు పోటీ చేస్తే ఎన్నికలు ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తోంది.
వీరిద్దరిలో ఎవరొక్కరూ అధ్యక్షుడిగా ఎన్నికైతే గాంధీ కుటుంబేతరగా వ్యక్తిగా రికార్డుల్లో ఎక్కుతారు.రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు.గాంధీ కుటుంబంతో ఆయనకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.దీంతో ఆయనకే అధ్యక్ష పదివి వరించే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరొవైపు కాంగ్రెస్ పార్టీలోని మెజారిటీ నేతలు గాంధీ కుటుంబసభ్యుడే పార్టీ చీఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నారు.ఒక్కవేళ రాహుల్ గాంధీ అద్యక్ష పదవిని నిరాకరిస్తే గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.ఇక శశి థరూర్ విషయానికి వస్తే గెలుపు అవకాశాలు తక్కవగానే ఉన్నప్పటికి.తాజాగా సోనియా గాంధీని కలవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది.సోనియాను కలవడం ద్వారా గెలుపు అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చని శశి థరూర్ భావించారు.ఎన్నికల్లో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు గట్టి పోటీ ఇవ్వచ్చు అని సోనియా మద్దతు కోరినట్లు సమాచారం.







