న్యాచురల్ స్టార్ నాని ప్రెసెంట్ వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు.ఈ మధ్యనే శ్యామ్ సింగరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.
శ్యామ్ సింగరాయ్ నాని కెరీర్ లో మరొక మైలు రాయిలాగా నిలిచి పోయింది.ఈ సినిమా తర్వాత నాని అంటే సుందరానికి సినిమా చేసాడు.
కానీ ఈ సినిమా అంతగా ప్రేక్షకులను మెప్పించలేక పోయింది.ఇక నాని ప్రెజెంట్ శ్రీకాంత్ ఓడేలా దర్శకత్వంలో ‘దసరా’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో ఊర మాస్ లుక్ లోకి వచ్చి మాస్ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు.గోదావరి ఖని లోని బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేసి వేగంగా పూర్తి కూడా చేస్తున్నాడు.ఇందులో ఈయనకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది.ఈ సినిమా చేతిలో ఉండగానే మరో డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.అది కూడా ప్లాప్ డైరెక్టర్ తో అని తెలుస్తుంది.
ఆ డైరెక్టర్ మరెవరో కాదు.మేర్లపాక గాంధీ.

వేంకటాద్రి ఎక్స్ ప్రెస్,ఎక్స్ ప్రెస్ రాజా వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన ఈయన నాని తో కూడా శ్రీకృష్ణార్జున యుద్ధం తీసాడు.అయితే ఈ సినిమా ప్లాప్ అయ్యింది.ఇక ఇటీవలే ఈయన చేసిన ఏక్ మినీ కథ హిట్ అయితే నితిన్ తో చేసిన మాస్ట్రో ప్లాప్ అయ్యింది.అయినా కూడా నాని ప్లాపుల్లో ఉన్న డైరెక్టర్ కు మరొక ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
మరి ఇది నిజమో కాదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.







