తిరుమల ఘాట్ రోడ్డులో ఎలక్ట్రిక్ బస్ పరిశీలన ప్రయోగాత్మకంగా సాగింది.ఒలెక్ట్రా కంపెనీకి చెందిన ఈ అధునాతన బస్ పనితీరు ఘాట్ రోడ్లపై సంతృప్తికరంగానే ఉందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
దీని ద్వారా ఎలాంటి సమస్యలు లేకుండా ఘాట్ రోడ్డు ప్రయాణాలు చేయవచ్చని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో తిరుమల – తిరుపతి మధ్య నెలాఖరుకు పది ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
డిసెంబర్ నాటికి తిరుమలకు మొత్తం 50 బస్సులు తిప్పేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.తిరుపతి జిల్లాకు వంద ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించామన్న అధికారులు.
అద్దె ప్రాతిపదికన నడుపుతామని స్పష్టం చేశారు.







