అంతకుముందు వెబ్ సీరీస్ లు చేస్తూ క్రేజ్ తెచ్చుకున్న అలేఖ్య హారిక బిగ్ బాస్ సీజన్ 4లో ఎంట్రీ ఇచ్చి అక్కడ తన సత్తా చాటింది.సీజన్ 4లో టాప్ 5 దాకా వెళ్లిన హారిక బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ ని వాడుకోలేకపోయింది.
బిగ్ బాస్ లో ఓ రేంజ్ లో గ్లామర్ షో చేసిన హారిక హౌజ్ లో ఉన్నంతకాలం బాగానే పాపులర్ అయినా కూడా హౌజ్ నుంచి బయటకు వచ్చాక మాత్రం అంతగా ఆకట్టుకోలేదు.మళ్లీ అంతకుందు లానే వెబ్ సీరీస్, స్పెషల్ సాంగ్స్ చేస్తూ కెరియర్ వెళ్లదీస్తుంది హారిక.
మరోపక్క అదే సీజన్ లో టాప్ 5 లో నిలిచిన అరియానా ఓ రేంజ్ లో పాపులారిటీ తెచ్చుకుంటుంది.బిగ్ బాస్ సీజన్ 5 ఎలిమినేటెడ్ కంటెస్టంట్స్ ఇంటర్వ్యూస్ కూడా అరియానా తీసుకుంది.
ఇప్పుడు బిబి కేఫ్ అంటూ ఈ సీజన్ గురించి కూడా ఎపిసోడ్స్ చేస్తుంది.మరి బిగ్ బాస్ వల్ల అరియానా కెరియర్ ఫుల్ స్వింగ్ లో ఉంటే అదే సీజన్ లో పాపులర్ అయిన హారిక మాత్రం వెనకపడ్డది.
మరి హారిక ఇకనుంచైనా గట్టి ప్రయత్నాలు చేసి అందరిని మెప్పించాలని కోరుకుందాం.







