తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టనున్నారు.ఈ మేరకు మరికాసేపట్లో తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేయనుంది.
అంబేద్కర్ దార్శనికతతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని సీఎం కేసీఆర్ అన్నారు.సచివాలయానికి అంతటి మహోన్నత వ్యక్తి పేరు పెట్టడం తెలంగాణకే గర్వ కారణమని చెప్పారు.
అంబేద్కర్ పేరు సచివాలయానికి పెట్టడం ద్వారా దేశానికే ఆదర్శంగా నిలుస్తామన్నారు.అదేవిధంగా నూతన పార్లమెంట్ భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలన్నారు.
ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని కూడా అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించిందని పేర్కొన్నారు.ఇదే విషయంలో త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.







