టీటీడీ ఈవో ధ‌ర్మారెడ్డి నియామ‌క అర్హ‌త‌పై రిట్ పిటిష‌న్ కొట్టివేత‌

టీటీడీ ఈవోగా ధ‌ర్మారెడ్డికి అన్ని అర్హ‌త‌లు ఉన్నాయ‌ని ఏపీ హైకోర్టు తెలిపింది.ఈ మేర‌కు ఆయ‌న నియామ‌క అర్హ‌త‌పై దాఖలైన రిట్ పిటిష‌న్ ను న్యాయ‌స్థానం కొట్టివేసింది.

 Dismissal Of Writ Petition On Appointment Eligibility Of Ttd Eo-TeluguStop.com

దేవాదాయ శాఖ చ‌ట్టం ప్ర‌కారం టీటీడీ ఈవోగా నియ‌మించేందుకు ధ‌ర్మారెడ్డికి అర్హ‌త ఉంద‌ని స్ప‌ష్టం చేసింది.

టీటీడీ అద‌న‌పు ఈవోగా ఉన్న ధర్మారెడ్డికి… ఈవోగా పూర్తి అద‌న‌పు బాధ్య‌తలు అప్ప‌గించ‌డాన్ని స‌వాల్ చేస్తూ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైన విష‌యం తెలిసిందే.

దేవదాయ చట్టంలోని 107వ సెక్షన్‌ ప్రకారం… జిల్లా కలెక్టర్‌ లేదా ఆ ర్యాంకుకు తగ్గని అధికారికి మాత్రమే ఈవోగా బాధ్యతలు చేపట్టేందుకు అర్హత ఉందని చెప్పారు.ధర్మారెడ్డి ఈవోగా బాధ్యతలు నిర్వర్తించకుండా నిలువరించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధ‌ర్మాస‌నం ఈవోగా ధర్మారెడ్డిని నియమించేందుకు అర్హతలు ఉన్నాయని పిటిషన్‌ను కొట్టేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube