పిల్లలు ఆకలితో ఏడుస్తుంటే ఏ తల్లి సైలెంట్‌గా ఉండలేదు.అయితే అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదు అనే సామెత ఉంది.
అందుకు విరుద్ధంగా ఓ ఘటన జరిగింది.అడిగినా అన్నం పెట్టడం లేదని, తన తల్లి కొడుతోందని ఓ బాలుడు కన్నీటి పర్యంతం అయ్యాడు.
అంతటితో ఆగకుండా ఏకంగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, తన తల్లిపై ఫిర్యాదు చేశాడు.ఈ ఘటన బీహార్‌లోని సీతామర్హి ప్రాంతంలో తాజాగా జరిగింది.
ఓ అమాయకమైన బాలుడు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఆ వీడియోలో ఓ ఎనిమిదేళ్ల బాలుడు పోలీస్ స్టేషన్‌కు ఏడుస్తూ వెళ్లాడు.
ఆపై జరిగిన ఆసక్తికర సంఘటనలు ఇలా ఉన్నాయి.
ఏడుస్తూ వచ్చిన బాలుడిని పోలీసులు అనునయంగా ఊరడిస్తారు.
విషయం చెప్పమని అడుగుతారు.ఆ బాలుడు ఏడుస్తూ అసలు విషయం చెప్పాడు.
తన తల్లి తనకు ఆకలి వేసినా ఆహారం పెట్టడం లేదని, పైగా అన్నం పెట్టమంటే కొడుతోందని వాపోయాడు. బాలుడు ఇలా ఏడుస్తూ చెప్పిన వీడియో ఎంతో మంది నెటిజన్ల హృదయాలను తాకుతోంది.
అతడి స్వస్థలం సీతామర్హి నగరంలోని చంద్రికా మార్కెట్ వీధిగా పోలీసులు తెలుసుకున్నారు.బాలుడిని శివంకుమార్‌గా గుర్తించారు.
ఫిర్యాదు చేయడానికి రావడంతో పోలీసులు అతడిని కూర్చబెట్టి వివరాలు ఆరా తీస్తారు.పోలీసులు అధికారి ఆ బాలుడిని వివరాలు చెప్పమని అడుగుతాడు.
పేరు, చిరునామా, తండ్రి పేరు అడుగుతాడు.దానికి ఆ బాలుడు కన్నీళ్లతో జవాబులు ఇచ్చాడు.
ఆ తర్వాత తన ఫిర్యాదును చెప్పాడు.తొలుత ఫిర్యాదు విని ఆశ్చర్యపోయిన పోలీసు సిబ్బంది, కొంతసేపటి తర్వాత చిన్నారిని పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టి అంతా మౌనంగా ఉండిపోయారు.
వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి, కొన్ని కారణాల వల్ల పిల్లల తల్లి ఇంట్లో ఆహారం వండకపోయి ఉండొచ్చని నెటిజన్లు ఊహిస్తున్నారు.బహుశా పేదరికం వల్ల ఈ పరిస్థితి వచ్చి ఉండొచ్చని జాలి పడుతున్నారు.
ఇక పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాలుడికి కడుపు నిండా పోలీసులు భోజనం పెట్టి పంపించారు.







