త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.మహేష్ బాబుకు జోడీగా పూజా హెగ్డే ఈ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.
ఈ సినిమా కోసం మహేష్ బాబు ఏకంగా 70 కోట్ల రూపాయలు జీఎస్టీ రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.
ఈ సినిమాకు ఏకంగా 280 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే విధంగా మేకర్స్ ప్లాన్ చేశారని తెలుస్తోంది.
ఈ సినిమా ఓవర్సీస్ కోసం నిర్మాతలు 23 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని బోగట్టా.సౌత్ డిజిటల్ హక్కులకు సంబంధించి ఏకంగా 100 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది.
ఈ సినిమా హిందీ వెర్షన్ విషయంలో మాత్రం రిలీజ్ సమయానికి నిర్ణయం తీసుకోనున్నారు.
హిందీలో ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయకపోతే హిందీ నుంచి 30 కోట్ల రూపాయల ఆదాయాన్ని నిర్మాతలు ఆశిస్తున్నారని తెలుస్తోంది.
ఈ సినిమా ఆడియో హక్కుల నుంచి ఏడు నుంచి ఎనిమిది కోట్ల రూపాయల ఆదాయం రావాలని నిర్మాతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.ఏపీ, తెలంగాణ థియేట్రికల్ హక్కుల ద్వారా నిర్మాతలు 115 కోట్ల రూపాయల ఆదాయం ఆశిస్తున్నారని తెలుస్తోంది.

నిర్మాతలు ఆశించిన రేంజ్ లో రేట్లు రాకపోయినా ఈ సినిమాకు 250 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.ఈ సినిమా ప్రొడక్షన్ కాస్ట్ కూడా భారీగానే ఉంటుందని తెలుస్తోంది.మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ విడుదలకు ముందే బిజినెస్ లెక్కలతో రికార్డులు క్రియేట్ చేస్తుండటం గమనార్హం.సినిమాసినిమాకు మహేష్ బాబు రేంజ్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.
సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే మహేష్ కెరీర్ పరంగా మరింత ఉన్నతస్థానాలకు ఎదుగుతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.







