అక్కడ ఆకాశంలో వింత మెరుపులు కనిపించాయి.. ప్రజలు అనుమానంతో చచ్చిపోతున్నారు!

నేడు సోషల్ మీడియా బాగా విస్తరించడంతో దేశంలోని ఎక్కడైనా ఎలాంటి వింతలూ విశేషాలు లాంటివి జరిగినా యిట్టె తెలిసిపోతున్నాయి.ఈ క్రమంలోనే ఓ వింత చోటు చేసుకుంది.

 Elon Musk Starlink Satellites Seen In Uttarpradesh Details, Sky , Misterous Ligh-TeluguStop.com

అవును, ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలోని లఖ్‌నవూ, ఫరూఖాబాద్‌తోపాటు పలు ప్రాంతాల్లో ఆకాశంలో వింత మెరుపులు జనాలకి దర్శనం ఇచ్చాయి.ఈ సోమవారం సాయంత్రం 7.30 గంటల సమయంలో వరుసగా కదులుతూ కనిపించిన ఆ వెలుగులను చూసిన ప్రజలు భయంతోపాటు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.

అవి చూడటానికి నక్షత్రాల్లా మెరుస్తూ.

రైలు డబ్బాల ఆకారంలో అల్లంత దూరం పొడుగ్గా వ్యాపించి ఉన్న వాటిని చూసి అక్కడి స్థానికులు అవాక్కయ్యారు.ఆకాశంలో అద్భుతమేమైనా జరుగుతుందేమోనని నోళ్లెళ్లబెట్టుకొని అలా చూస్తూ ఉండిపోయారు.

ఈ క్రమంలో పలువురు ఆ దృశ్యాలను ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ.ఇది గ్రహంతరవాసుల పనా? అంటూ తమ అనుమానాలను వ్యక్తం చేశారు.అయితే, ఇవన్నీ అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్‌ సంస్థ పంపించిన ఉపగ్రహాలు అయ్యుంటాయని అనేక మంది అభిప్రాయపడ్డారు.

ఇకపోతే, స్పేస్ఎక్స్‌ సంస్థ ఇటీవలే 51 ఉపగ్రహాలను నింగిలోకి పంపించింది.ఫ్లోరిడా తీరం నుంచి వాటిని ప్రయోగించడం జరిగింది.భూమ్మీద మారుమాల ప్రాంతాలకు సైతం బ్రాడ్​బ్యాండ్ సేవలను విస్తరించే లక్ష్యంతో చేపట్టిన స్టార్​లింక్ ప్రాజెక్టు కోసం అనేక ఉపగ్రహాలను స్పేస్ఎక్స్ నింగిలోకి వారు ప్రయోగిస్తున్న సంగతి అందరికీ తెలిసినదే.

ఈ క్రమంలోనే ఇలా జరిగి వుండచ్చని కొంతమంది పండితులు అభిప్రాయపడుతున్నారు.అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా రాకపోవడం కొసమెరుపు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube