కొంత కాలంగా యూట్యూబ్ తన వీక్షకుల సహనానికి పరీక్ష పెడుతోంది.Google యాజమాన్యంలోని ఈ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫారమ్ సెప్టెంబర్ నెల ప్రారంభం నుంచే కొత్త అడ్వర్టయిజ్‌మెంట్ పాలసీ అమలు చేస్తోంది.
యూట్యూబ్ ప్రీమియమ్ సభ్యత్వం పొందని యూజర్లకు వీడియోలు వీక్షించే ముందు గరిష్టంగా 5 అడ్వర్టయిజ్‌మెంట్‌లను ప్రసారం చేస్తోంది.చాలా మంది యూట్యూబ్ ఫ్రీ యూజర్లు తమ యూట్యూబ్ వీడియోను చూడకముందే 2కి బదులుగా 5 యాడ్‌లను అందుకుంటున్నారు.
దీనిపై ట్విట్టర్, రెడ్డిట్‌లలో పలువురు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.చాలా మంది యూట్యూబ్ యూజర్లు వారు వీడియో వీక్షించే ముందు కొన్ని స్కిప్ చేసే యాడ్‌లు వచ్చేవి.
అవి కేవలం 5 సెకండ్లలో వాటిని స్కిప్ చేసే అవకాశం ఉండేది.
ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు.
యూట్యూబ్ ప్రసారం చేసే 5 యాడ్‌లను ఖచ్చితంగా చూడాల్సిన దుస్థితి నెలకొంది.దీనిపై యూట్యూబ్ ట్విట్టర్‌లో అధికారికంగా ప్రకటించింది.
తమ కంపెనీ 5 యాడ్‌ల ప్రసారానికి సంబంధించిన కొత్త పాలసీ తీసుకొచ్చిందని తెలిపింది.దీనిపై నెట్టింట తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
ప్రస్తుతానికి, యూట్యూబ్‌ను ఫ్రీగా ఉపయోగించే చాలా మంది వినియోగదారులు తమ వీడియో ప్రారంభం కావడానికి ముందు 2 ప్రకటనల వరకు మాత్రమే చూస్తున్నారు.

అయితే “5-ప్రకటనల ఫార్మాట్” మార్పు త్వరలో YouTube ఉచిత వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తుందో లేదో ఖచ్చితంగా తెలియదు.యూట్యూబ్ అడ్వర్టయిజ్‌మెంట్ విధానానికి సంబంధించి ఉచిత, ప్రీమియం వినియోగదారులకు ఏదైనా ఫీడ్‌బ్యాక్ ఉన్నట్లయితే, కంపెనీ వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్‌లోని “ఫీడ్‌బ్యాక్ సెండ్” ద్వారా యూజర్లు ఎల్లప్పుడూ కంపెనీకి నేరుగా అభిప్రాయాన్ని పంపవచ్చని యూట్యూబ్ తెలిపింది.దానికి వెల్లువలా వినియోగదారులు ఫిర్యాదులు పంపుతున్నారు.
ఇప్పటికే 2 యాడ్స్ అంటే ఎక్కువని, దానికి తోడు 5 యాడ్‌లను వీక్షించాలని కోరుకోవడం దారుణమని కామెంట్లు చేస్తున్నారు.







