వరలక్ష్మి శరత్ కుమార్ రవితేజ నటించిన క్రాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది.ఈ సినిమాలో జయమ్మ పాత్రలో నటించి విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది.ఇకపోతే ఈమె కెరీర్ మొదట్లో హీరోయిన్గా నటించిన తర్వాత ఈ మధ్యకాలంలో విలన్ పాత్రల్లో,క్యారెక్టర్ ఆర్టిస్టు గా కూడా నటిస్తోంది.
అయితే ఇలా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడానికి గల కారణం ఆమె బరువు పెరగడమే అంటూ పలువురు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే హీరోయిన్గా చేయాల్సిన వయసులో ఈ విధంగా పెద్ద పెద్ద పాత్రలు చేయడం ఏంటో అర్థం కావడం లేదు అంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే క్రాక్ సినిమా తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్ సన్నబడి నాజూగ్గా తయారయ్యింది.అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు గ్లామర్ షో కూడా చేస్తోంది.
తాజాగా ఈమె తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలను చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.

క్రాక్ సినిమాలో చూసిన వరలక్ష్మి శరత్ కుమార్ ఫోటోలో చూస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరేనా అంటూ ఆశ్చర్య పోతున్నారు.వరలక్ష్మి శరత్ కుమార్ తాజా ఫోటోలను చూసిన నెటిజన్స్, అభిమానులు మీరు ఇక నుండి విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాల్సిన అవసరం లేదు.ఇక నుండి మీరు మళ్లీ హీరోయిన్ గా సినిమాలు చేయాలి అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఆమెని హీరోయిన్గా నటించాలి అని కోరుకుంటున్నారు.
కాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.







