పిట్ట కొంచం కూత ఘనం... ఆ పాప ట్యాలెంట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే మరీ...!

వయసుకు ట్యాలెంట్ కు సంబంధం లేదని కొంత మంది చిన్నారులు చేసే పనులు చూస్తే అర్థం అవుతుంది.అబ్బుర పరిచే వారి పనులకు ఆశ్చర్యపోక ఉండలేం.

 You Have To Be Shocked To See The Baby S Talent , Kids Talent, Viral Latest, New-TeluguStop.com

ఒక్కోసారి వారు చేసే పనులు చూస్తే మనం షాక్ లో ఉండిపోతాం.పిట్ట కొంచం కూత ఘనం అనే సామెతలు ఇలాంటి వారిని చూసే పుట్టుకొచ్చాయ అనిపిస్తుంది.

ఏలెడు లేరు ఏం చేశారో చూడని.వారి చేసే పనులు చూసి నివ్వెరపోతాం.

ఇలాంటి ఘటన ఇప్పుడు సోషల్ మీడియా కేంద్రంగా ఉన్న ట్విట్టర్ లో తెగ వైరల్ అవుతుంది.ఓ చిన్నారి చేసిన పనికి నెటిజన్లు తెగ ఫిదా అవుతున్నారు.

ఆ చిన్నారికి మంచి భవిష్యత్ ఉండాలని దివెనలు ఇస్తున్నారు.ఇలాంటి వారిని చూసి అయినా ఆడ పిల్లలంటే తక్కువ చూపు చూస్తున్న తల్లిదండ్రులు సిగ్గుతో తలదించుకోవాలి.

ఆధునిక సమాజంలో కూడా ఆడ మగ తేడా చూస్తూ ఆడ పిల్ల పుడితే అత్తింట్లో కోడలను వేధిస్తున్న అత్త మామల బుద్ధి మారాలని సందేశాత్మక మెసేజ్ లు రాస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.

సోషల్ మీడియాలో ‘ఆమేజింగ్ గార్ల్ ఆమె ట్యాలెంట్ కు మీరు కూడా షెల్యూట్ చేస్తారంటూ’ కొటేషన్ పెట్టి ఓ వీడియోను పోస్ట్ చేశారు.అందులో గుక్క తిప్పుకోకుండా 38 సెకండ్లలో 75 జిల్లాల పేర్లన్నీ అక్షర క్రమంలో గడగడ చెప్పి ఆ పాప అందరినీ ఆశ్చర్య పరిచింది.

ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఉత్తరప్రదేశ్ లోని దియోరియా జిల్లాలో మౌన్వీ చౌరాసియా ఆదర్శ్ ప్రాథమిక పాఠశాలలో ఆ చిన్నారి నాల్గవ తరగతి చదువుతోంది.

పాప ట్యాలెంట్ ను చూసిన వారందరూ ప్రశంసలు గుప్పిస్తున్నారు.వారి మద్దతును లైక్ లు, ట్వీట్ ల రూపంలో ఆ వీడియోకు తెలియజేస్తున్నారు.ఇలాంటి చిన్నారులు అరుదుగా ఉంటారని.ఆ పాప భవిష్యత్ లో భాగా రాణించాలని ఆమెకు ఆశీసులు గుప్పిస్తున్నారు.

ప్రస్తుతం ఆ చిన్నారి వీడియోకు వేల సంఖ్యలో లైకులు వచ్చాయి.

ఇకపోతే అందరి ఇళ్లలోనూ ఇలాంటి చిన్నారులు ఉంటారని.

పుట్టుకతోనే ఎవరూ ఏమి నేర్చుకోరని తమ చిన్నారులను ప్రోత్సహించి వారి ట్యాలెంట్ గుర్తిస్తే మీ ఇంట్లో కూడా ఐన్ స్టీన్ ను మించిన మేథావులు తయారు కావోచ్చని ప్రముఖులు తెలియజేస్తున్నారు.ట్యాంలెంట్ అంటే చదువు ఒక్కటే కాదని.

చిన్నారుల్లో ఉన్న ట్యాలెంట్ ను తల్లిదండ్రులే గుర్తించి ఆ రంగంలో వారిని ప్రోత్సహిస్తే అద్భుతాలు చేసే అవకాశం ఉందని సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube