హైదరాబాద్ లో మరో అగ్నిప్రమాదం జరిగింది.జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లోని జూబ్లీ 800 పబ్ పక్కనున్న ఓ కార్యాలయంలో మంటలు చెలరేగాయి.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.అయితే ఆఫీస్ లో ఎవరూ లేరని తెలుస్తోంది.
నిన్న రాత్రి సికింద్రాబాద్ లోని రూబీ లాడ్జ్ అగ్నిప్రమాద ఘటనలో ఎనిమిది మంది మృతిచెందిన విషయం తెలిసిందే.







