దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.గత ఆగస్ట్ నెల తర్వాత గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.
అంతర్జాతీయ సానుకూలతల నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు.ద్రవ్యోల్బణం పెరిగినట్టు గణాంకాలు వెలువడినప్పటికీ… అంతర్జాతీయ సానుకూలతలు కలిసి వచ్చాయి.
ఈ నేపథ్యంలో ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 456 పాయింట్లు లాభపడి 60,571కి చేరుకుంది.నిఫ్టీ 134 పాయింట్లు పెరిగి 18,070 వద్ద స్థిరపడింది.
ఆటో, ఎనర్జీ, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు మినహా అన్ని సూచీలు లాభాలను మూటకట్టుకున్నాయి.







