సీతారామం మూవీ ఆ బ్లాక్ బస్టర్ మూవీకి కాపీ అంటూ ట్రోల్స్.. ఏమైందంటే?

ఈ ఏడాది థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో సీతారామం సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే.45 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ప్రస్తుతం సీతారామం సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.వేర్వేరు కారణాల వల్ల థియేటర్లలో ఈ సినిమాను చూడని వాళ్లు ప్రస్తుతం ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో చూసి అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు.

 Copy Trolls About Seetharamam Movie Details, Settha Ramam, Malleshwari Movie, Si-TeluguStop.com

అయితే సోషల్ మీడియాలో మెజారిటీ ప్రేక్షకులు ఈ సినిమా గురించి పాజిటివ్ గా చెబుతుండగా కొంతమంది మాత్రం ఈ సినిమా గురించి నెగిటివ్ గా చెబుతుండటం గమనార్హం.మల్లీశ్వరి సినిమాలో హీరోయిన్ యువరాణి అని పెళ్లి కాని ప్రసాద్ పాత్ర పోషించిన వెంకటేష్ కు తెలియదని సీతారామం సినిమాలో కూడా అదే విధంగా జరుగుతుందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ రెండు సినిమాలలో ఫైట్ సీన్ ద్వారా హీరో హీరోయిన్ మనస్సుకు దగ్గరవుతాడని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మల్లీశ్వరి సినిమాలో వెంకటేష్ ఏ విధంగా జీతం గురించి చెబుతాడో ఈ సినిమాలో హీరో కూడా తన జీతం గురించి అదే విధంగా చెబుతాడని కామెంట్లు చేస్తున్నారు.రెండు సినిమాల మధ్య పోలికలకు సంబంధించిన వీడియోలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఏ సినిమాకు అయినా మరో సినిమాతో పోలికలు ఉండటం కామన్ అని అంత మాత్రం చేత కాపీ అని కామెంట్ చేయడం కరెక్ట్ కాదని మరి కొందరు చెబుతున్నారు.వైరల్ అవుతున్న కామెంట్ల గురించి సీతారామం మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.సీతారామం నిర్మాతలకు భారీ స్థాయిలో లాభాలను అందించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube