మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు నిన్ననే ప్రారంభం అయ్యాయి.
కేవలం మూడు నెలల్లో సినిమాను పూర్తి చేస్తాం అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా చెప్తున్నారు.వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తారీఖున సినిమా విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
కనుక మూడు నాలుగు నెలల్లో సినిమాను పూర్తి చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది.మహేష్ బాబుతో సినిమా పూర్తి అయిన తర్వాత త్రివిక్రమ్ తన తదుపరి సినిమాని అల్లు అర్జున్ తో చేయబోతున్నట్లుగా మొన్నటి వరకు వార్తలు వచ్చాయి.
కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రానా తో త్రివిక్రమ్ సినిమా ఉండబోతుందని.అది కూడా హిరణ్య కశ్యప అనే కాన్సెప్ట్ తో ఉంటుంది అంటూ ప్రచారం జరుగుతోంది.
గతంలో ఇదే కాన్సెప్ట్ తో రానా హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో ఒక సినిమాను అనుకున్నారు.కానీ గుణశేఖర్ ఆ సినిమాను పట్టాలెక్కించడంలో విఫలమయ్యాడు.భారీ బడ్జెట్ తో గుణశేఖర్ తో సినిమా మొదలు పెడితే పరిస్థితి ఎలా ఉంటుందో అని అంతా అనుమానం వ్యక్తం చేసి నిర్మాతలు సినిమా ను నిర్మించేందుకు ముందుకు రాలేదు.రానా కూడా సినిమా పై ఆసక్తి చూపించలేదట.
కానీ ఇప్పుడు త్రివిక్రమ్ ఆ సబ్జెక్టుని అనుకుంటుండడంతో అంతా ఆసక్తిగా చూస్తున్నారు.మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ పౌరాణిక చారిత్రాత్మక నేపథ్యం లో సినిమా లు ఇప్పటి తీయలేదు.
మొదటి సారి ఈ సినిమాతో ఆయన తెలుగు ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయబోతున్నాడు.ఇప్పటికే దర్శకుడు గుణశేఖర్ తో చర్చలు జరుపుతున్నారని.
టైటిల్ తో పాటు ఆయన ఇన్పుట్స్ కూడా తీసుకుని సినిమా ను తీర్చిదిద్దాలని దర్శకుడు త్రివిక్రమ్ భావిస్తున్నాడట.సినిమాకు రాధాకృష్ణ భారీ ఎత్తున ఖర్చు చేసేందుకు ఇప్పటికే రెడీ అన్నట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమా టాలీవుడ్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా స్పెషల్ అన్నట్లుగా ఉంటుందట.







