ఇప్పుడు బుల్లితెర హవా ఎక్కువగా నడుస్తుంది.నిజానికి ఒకప్పడు వెండితెరకి ఉండేది క్రేజ్.
కానీ ఇప్పుడు చూస్తే మాత్రం వెండితెర కంటే ఎక్కువగా బుల్లితెర దూసుకుపోతుంది.పైగా బుల్లితెరకు విపరీతమైన అభిమానుల సంఖ్య కూడా పెరిగింది.
కేవలం సీరియల్స్ కాకుండా ఎన్నో ఎంటర్టైన్మెంట్ షోలు ప్రసారం అవుతూ బాగా సందడి చేస్తున్నాయి.ఇక ఒకప్పుడు బుల్లితెరపై కొత్తగా ప్రసారమయ్యే సీరియల్స్, షోలను ప్రమోట్ చేయడానికి అంతగా హడావుడి చేసే వాళ్ళు కాదు.
కానీ ఇప్పుడు వాటి రేంజ్ పెరగటంతో.ఈమధ్య ప్రమోషన్స్ కోసం భారీ పారితోషకాలు ఇచ్చుకొని మరి వెండితెర సెలబ్రెటీలను ముందుకు తీసుకువస్తున్నారు.
ఇప్పటికే నాగార్జున బుల్లితెరపై పలు సీరియల్స్ తో పాటు పలు షో లను కూడా ప్రమోట్ చేసిన సంగతి తెలిసింది.ఇక తాజాగా మహేష్ బాబు కూడా బుల్లితెర ఛానల్ జీ తెలుగులో ప్రతిదీ ప్రమోట్ చేయడానికి దాదాపు సంవత్సరం పాటు డీల్ కుదుర్చుకున్నాడు.
అందులో ప్రసారం అయ్యే షో లను, సీరియల్స్ ను ప్రమోట్ చేయటానికి డీల్ ఒప్పుకున్నట్టు తెలుస్తుంది.ఇటీవలే తన కూతురు సితార తో కలిసి ఓ డాన్స్ షోను ప్రమోట్ చేయడానికి వచ్చాడు.
ఇక దానికి మహేష్ బాబు 9 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.మహేష్ బాబు రావటంతో ఆ షో రేటింగులో కూడా బాగా దూసుకుపోయింది.

కేవలం షోలను కాకుండా సీరియల్స్ ను కూడా ప్రమోట్ చేశాడు మహేష్ బాబు.గతంలో కూడా జీ తెలుగులో ప్రసారమైన సీరియల్స్ ను ఆయనే స్వయంగా ప్రమోట్ చేశాడు.ఇక మళ్లీ ఇటీవలే తొమ్మిది కోట్ల పారితోషకంతో డీల్ ఒప్పుకున్నాడు.దీంతో జీ తెలుగు యాజమాన్యం మహేష్ బాబును పిచ్చలవిడిగా వాడుకుంటుంది.తము ఏ షో ప్రారంభించిన.ఏ సీరియల్ ను ప్రారంభించిన కచ్చితంగా మహేష్ బాబు ఉండాల్సిందే.
ఎందుకంటే మహేష్ బాబుకు వెండితెరపై ఉన్న క్రేజ్ ను బుల్లితెరపై కూడా చూపించాలి అని జీ తెలుగు యాజమాన్యం మహేష్ బాబును బాగా వాడుకుంటుంది.

ఇక తాజాగా.జీ తెలుగులో పడమటి సంధ్యారాగం అనే పేరుతో ఓ సీరియల్ ప్రారంభమవుతుంది.ఇక ఈ సీరియల్ కూడా మహేష్‌బాబు ప్రమోట్ చేస్తున్నాడు.
పైగా ఆయన కూతురు సితార కూడా ఆ సీరియల్ ప్రకటనలో కనిపించింది.ఇక ఈ సీరియల్ సెప్టెంబర్ 19 నుంచి ప్రసారమవుతున్నట్లు తెలుస్తుంది.
ఇక ఇదొక్క సీరియల్ నే కాదు మరెన్నో ప్రాజెక్టులను కూడా ప్రమోట్ చేయడానికి మహేష్ బాబు సిద్ధంగా ఉన్నాడు.
ఇక దీనిని బట్టి చూస్తే మహేష్ బాబు జీ తెలుగు కి బ్రాండ్ అంబాసిడర్ అని పడిందని అర్థమవుతుంది.
ఇక ఓవైపు వెండితెరపై కూడా వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు మహేష్ బాబు.మొత్తానికి అటు బుల్లితెర, ఇటు వెండితెరపై బాగానే సంపాదించుకుంటున్నాడు మహేష్ బాబు.







