ప్రముఖ నటుడు కృష్ణంరాజు మరణ వార్త రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు సాధారణ ప్రేక్షకులను సైతం షాక్ కు గురి చేసిన సంగతి తెలిసిందే.గతంలో ఒక ఇంటర్వ్యూలో కృష్ణంరాజు మాట్లాడుతూ తన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
తనకు శివుడు అంటే చాలా ఇష్టమని నా పూర్తి పేరు శ్రీ ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు అని ఆయన చెప్పుకొచ్చారు.అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మాత్రం కృష్ణంరాజు అని రిజిస్ట్రేషన్ చేయించానని ఆయన తెలిపారు.
అలా పేరు రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత కొన్నిరోజుల పాటు ఏ పని చేసినా నాకు కలిసిరాలేదని సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయని ఆయన అన్నారు.ఆ సమయంలో మా ఊళ్లో ఒక వ్యక్తి నేను చేసిన తప్పును వివరించి చెప్పారని ఆయన చెప్పుకొచ్చారు.
మీ కుల దైవం వేంకటేశ్వర స్వామి అని నీ పేరులో ముందున్న వెంకట తీసేశావని అందువల్లే నీకు సమస్యలు వస్తున్నాయని చెప్పారని కృష్ణంరాజు కామెంట్లు చేశారు.

ఆయన చెప్పిన మాటలు నిజమేనని నాకు కూడా అనిపించిందని కృష్ణంరాజు చెప్పుకొచ్చారు.కొన్ని తరాల నుంచి మా ఇంట్లో ప్రతి ఒక్కరి పేరు ముందు వెంకట ఉందని ఆయన అన్నారు.ఆ తర్వాత నా పేరుకు ముందు ఉప్పలపాటి వెంకట జత చేయగా అప్పటినుంచి అదృష్టం కలిసొచ్చిందని ఆయన తెలిపారు.
నేను మేకప్ వేసుకున్నానంటే మరేదీ గుర్తొచ్చేది కాదని ఆయన అన్నారు.

నేను ఏ పాత్రలో నటిస్తే ఆ పాత్రలో పూర్తిగా లీనమైపోతానని ఆయన కామెంట్లు చేశారు.భక్త కన్నప్ప సినిమాలో శివుడికి కన్ను ఇచ్చే సీన్ షూట్ చేసే సమయంలో శరీరం, మనసులో ఏదో తెలియని ఉద్వేగం వచ్చేదని ఆయన కృష్ణంరాజు వెల్లడించారు.కృష్ణంరాజు గతంలో వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







