ఫిర్యాదులపై విచారణ చేపట్టిసత్వర పరిష్కారానికి కృషి చేయాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ పోలీస్ అధికారులకు ఆదేశించారు.
ఈ రోజు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన గ్రివేన్స్ సందర్భంగా వివిధ సమస్యల పై వచ్చిన ప్రజాఫిర్యాదులను పోలీస్ కమిషనర్ గారు స్వీకరించి పరిశీలించి బాధితులతో మాట్లాడారు.బాధితుల ఫిర్యాదులపై తక్షణ చర్యల నిమిత్తం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ రోజు వచ్చిన ఫిర్యాదులలో భూ వివాదాలు, కుటుంబ తగాదాలకు,ఇతర ఫిర్యాదులు వరకు వచ్చాయి.ఫిర్యాదులపై చట్టపరమైన చర్యలు తీసుకొవాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు.
శిక్షణలో భాగంగా గ్రివేన్స్ కార్యక్రమంలో అసిస్టెంట్ శిక్షణ కలెక్టర్ రాధికా గుప్తా గారు పాల్గొన్నారు.







