మరో స్టైలిష్ ఫోటో పంచుకున్న మహేష్ భార్య.. ఫ్యాన్స్ ఫిదా!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫాలోయింగ్ గురించి తెలియని ప్రేక్షకులు లేరు.ఈయన 47 ఏళ్ల వయసులో కూడా హ్యాండ్సమ్ యంగ్ అండ్ చార్మింగ్ లుక్ తో యువతను మాయ చేయడంలో ముందు వరుసలో ఉన్నాడు.

 Namrata Shared Mahesh Babu New Pic Gone Viral Details, Pooja Hegde, Mahesh Babu,-TeluguStop.com

ఈ మధ్య మరిన్ని కొత్త కొత్త స్టైలిష్ లుక్ తో మెస్మరైజ్ చేస్తున్నాడు.

పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న కూడా ఇప్పటికి యువతుల కళల రాకుమారుడిగా కీర్తించ బడుతున్నాడు.

టాలీవుడ్ లో మాత్రమే కాదు.ప్రపంచ వ్యాప్తంగా ఎవర్ గ్రీన్ చార్మింగ్ హీరోగా ఫ్యాన్స్ చేత జేజేలు కొట్టించు కుంటున్నాడు.

ఈయన ఏజ్ పెరుగుతున్న అందం మాత్రం తగ్గడం లేదు.

తాజాగా మహేష్ బాబు ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అయ్యింది.

ఈ మధ్య మహేష్ చేయబోతున్న త్రివిక్రమ్ సినిమా కోసం కొత్త లుక్ లోకి మారిపోయిన విషయం తెలిసిందే.ఈ లుక్ లోనే మరో ఫోటోను ఆయన భార్య నమ్రత శిరోద్కర్ షేర్ చేసింది.

ఈయన చాలా యంగ్ లుక్ లో గడ్డం తో పాటు కొత్త హెయిర్ స్టైల్ లో కనిపిస్తూ మరింత ఆకర్షిస్తున్నాడు.

దీంతో ఆ ఫోటో నెట్టింట వైరల్ అయ్యింది.

ఇక మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.ఈ సినిమా ఈ రోజే సెట్స్ మీదకు వెళ్ళింది.

రేపటి నుండి రెగ్యురల్ షూట్ జరుపుకోనున్న ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఈ మూవీలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube