రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం రెండు తెలుగు రాష్ట్రాల సినీ అభిమానులను షాక్ కు గురి చేసిన సంగతి తెలిసిందే.కొన్నిరోజుల క్రితం వరకు ఆరోగ్యంగా ఉన్న కృష్ణంరాజు మరణించారనే వార్తను నమ్మలేకపోతున్నామని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
నటుడిగా కృష్ణంరాజు 187కు పైగా సినిమాలలో నటించగా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు విజయాలను అందుకున్నాయి.
రెండుసార్లు ఎంపీగా ఎంపికైన కృష్ణంరాజు మంత్రిగా కూడా పని చేశారు.
వేర్వేరు ఆరోగ్య సమస్యలు ఆయన మరణానికి కారణమయ్యాయి.మధుమేహం వల్ల కృష్ణంరాజు కాలివేలిని గతేడాది తొలగించారు.
షుగర్ వల్ల ఆయనను దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి వేధించిందని ఆ సమస్యతో కృష్ణంరాజు చాలా ఇబ్బంది పడ్డారని సమాచారం.ఆ తర్వాత కృష్ణంరాజు కరోనా బారిన పడ్డారు.
కరోనా నుంచి కోలుకున్నా పోస్ట్ కోవిడ్ సమస్యలు ఆయనను వేధించాయి.
ఆ తర్వాత న్యూమోనియోతో పాటు కృష్ణంరాజు ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడ్డారని సమాచారం అందుతోంది.
గతేడాది నుంచి ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలతో కూడా బాధ పడ్డారని బోగట్టా.వేర్వేరు ఆరోగ్య సమస్యల వల్ల గత కొన్ని నెలల నుంచి కృష్ణంరాజు చాలా ఇబ్బంది పడ్డారని సమాచారం.
షుగర్, ఇతర ఆరోగ్య సమస్యల వల్లే ఆయనకు గుండెపోటు వచ్చిందని సమాచారం అందుతోంది.

కృష్ణంరాజు సొంత వ్యవసాయ క్షేత్రంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.ఈ వ్యవసాయ క్షేత్రంలో ఇల్లు కట్టుకొని చివరి రోజులు గడపాలని ఆయన భావించగా ఆ ఇంటి నిర్మాణం పూర్తికాక ముందే ఆయన చనిపోవడం కుటుంబ సభ్యులను బాధ పెడుతోంది.కృష్ణంరాజు మరణం టాలీవుడ్ ఇండస్ట్రీకి తీరని లోటు అనే చెప్పాలి.
కృష్ణంరాజు మరణ వార్త విని తట్టుకోలేక ప్రభాస్ బాధ పడుతుండగా ప్రభాస్ అభిమానులు కూడా కంటతడి పెట్టుకుంటున్నారు.







