భారతీయ సనాతన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన స్వామి వివేకానంద చికాగో ఉపన్యాసం 129వ వార్షికోత్సవం సందర్భంగా.వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్లెన్స్ ఆధ్వర్యంలో ఖమ్మంలోని ఇల్లందు క్రాస్ రోడ్ వద్ద స్వామి వివేకనంద విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా ఖమ్మం భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ మరియు VIHE ఫౌండర్ దేవికి వాసుదేవ గారు మాట్లాడుతూ స్వామి వివేకానంద గారు చికాగోలో జరిగిన మత సమ్మేళనాన్ని గు
ఈ సమ్మేళనం ద్వారా భారతీయ సనాతన ధర్మం స్వామి వివేకానంద గారు విశ్వవ్యాప్తం చేశారని గుర్తు చేశారు.అందరూ స్వామి వివేకానంద గారి ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని తెలిపారు.
వివేకానంద గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని యువతకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి శీలం పాపా రావు గారు, అంకటి పాప రావు గారు, అంజయ్య గారు, వేల్పుల సుధాకర్ గారు, గన్నవరపు చంద్ర శేఖర్ గారు, జై పటేల్, ప్రవీణ్ పటేల్ హాజరయ్యారు.
.






