ట్రైన్‌ ప్రయాణికులకు ఈ విషయం తెలుసా? టాయిలెట్ పక్కన బెర్త్ రాకుండా ఇలా బుక్ చేయొచ్చు!

రైల్వే ప్రయాణం అంటే ఇష్టపడనివారు ఎవరుంటారు చెప్పండి.అందులోను రిజర్వేషన్లో ప్రయాణిస్తే ఆ కిక్కే వేరే ఉంటుంది.

 Do Train Passengers Know This? You Can Book Like This Without Getting A Berth N-TeluguStop.com

ఐతే సీటు దొరకపోతే మాత్రం ఒకింత కష్టంగా మారుతుంది ప్రయాణం.ముఖ్యంగా టాయిలెట్ పక్కన సీటు వస్తే మాత్రం అంతకంటే నరకం ఇంకొక్కటి ఉండదు.

ఎప్పుడు దిగిపోదామా అనిపిస్తుంది.ఎందుకంటే అనేక రకాల వ్యక్తులు మరుగుదొడ్లు ఉపయోగించడం వల్ల.

ప్రవేశ ద్వారం ప్రతిసారి తెరవడంతో తీవ్రమైన దుర్వాసన వస్తూ ఉంటుంది.అయితే టాయిలెట్లు, ప్రవేశ ద్వారం దగ్గరల్లో మీకు ట్రైన్ సీటు రాకుండా ఎలా బుక్‌ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

మరుగుదొడ్ల వద్ద ట్రైన్లో సీటు రాకుండా ఉండాలంటే ముందుగా మీరు ఓ పని చెయ్యాలి.వీలైనంత త్వరగా టికెట్‌ను బుక్ చేసుకుంటే ఉత్తమం.ఎందుకంటే, IRCTC.ఫస్ట్-కమ్-ఫస్ట్ సర్వే ప్రాతిపదికన సీట్లను పంపిణీ చేస్తుంది.

మీరు ముందే బుక్‌ చేసుకుంటే కోచ్ మధ్యలో సీటు దొరికే వెసులుబాటు ఉంది.సీట్లను కేటాయించేటప్పుడు ప్రాధ్యానత ఎంచుకోవాలని IRCTC అడుగుతుంది.

దానిని నింపకపోవడం వల్ల కోచ్‌ చివర్లో సీట్లు దక్కే అవకాశం ఉండదు.మీకు అదృష్టం ఉంటే ఆలస్యం బుక్ చేసుకున్నా.

మధ్యలో సీటు దొరికే అవకాశం ఉందికానీ, ముందు చేసుకోవడమే ఉత్తమం.

ఇకపోతే ఈ విషయాలు కూడా తెలుసుకోవాలి.

AC 1వ తరగతికి కేటాయించబడ్డ కోచ్‌ కోడ్ హెచ్‌గా ఉంటుంది కాబట్టి ఈ కోచ్‌లో అప్పర్ వన్, లోయర్ వన్ అంటూ 24 బర్త్‌లు ఉంటాయి.వాటిని అవసమైతే మూసుకోవచ్చు… లేదా లాక్‌ చేసుకోవచ్చు.

అలాగే 2 టైర్ ఏసీ స్లీపర్ క్లాస్‌కు కేటాయించబడ్డ కోచ్‌ను కోడ్ ఏగా పిలుస్తారు.కోచ్ పరిమాణాన్ని బట్టి 46 నుంచి 54 బెర్త్‌లు ఉంటాయి.రెండు అంచెలుగా లోయర్, అప్పర్ బెర్త్‌లు ఉంటాయి.3 టైర్ ఏసీ స్లీపర్ క్లాస్‌ను కోడ్‌ బీగా అంటారు.ఒక్కో కోచ్‌లో 64 బెర్త్‌లు ఉంటాయి.ఈ విధంగానే కోచ్ లను బట్టి సీట్స్ అనేవి ఉంటాయి.కాబట్టి వాటిని ఫాలో అవుతూ మనమే ఆన్లైన్లో టికెట్టు చేసుంటే ఉత్తమం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube