తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం సరికొత్త రికార్డు సృష్టించింది.ఆల్‌టైమ్ రికార్డ్ బ్రేక్ చేసింది.
ప్రతి నెలా శ్రీనివాసుడి హుండీ ఆదాయం 120 కోట్లు దాటుతున్నట్లు టీటీడీ లెక్కలు చెబుతున్నాయి.ఈసారి ఆ రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ స్వామివారి హుండీ ఆదాయం రూ.140 కోట్లు దాటింది.
మునుపెన్నడూ లేని విధంగా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు.
దీంతో శ్రీవారి హుండీ ఆదాయం కూడా భారీగా పెరుగుతోంది.ఈ క్రమంలోనే ఆగస్ట్ నెలలో స్వామివారి హుండీ ఆదాయం రికార్డ్ స్థాయికి చేరుకుంది.ఒక్క నెలలో 22.22 లక్షల మంది స్వామివారిని దర్శించుకోగా.రూ.140.34 కోట్ల హుండీ ఆదాయం లభించిందని టీటీడీ అధికారులు తెలిపారు.







