బిగ్ బాస్ సీజన్ 6 లో మొదటి వారం వరస్ట్ పర్ఫార్మెన్స్ గా గీతు రాయల్ ని ఎంపిక చేసి ఆమెని బిగ్ బాస్ జైలులోకి పంపించేశారు.షో మొదలైన రోజు నుంచి గీతు రాయల్ మిగతా కంటెస్టంట్స్ మీద పైచేయి సాధించాలని చూసింది.
అయితే అది ఆటలో భాగమే కానీ కొన్నిసార్లు ఆమె కొన్ని మాటలను అంటుంది.ఆ విషయంలో హౌజ్ మెట్స్ హర్ట్ అవుతున్నారు.
అంతేకాదు కెప్టెన్సీ టాస్క్ లో తాను గెలవడం కోసం ఏదైనా చేస్తానని అనడం కూడా ఆమెని వరస్ట్ పర్ఫార్మర్ గా ఎన్నుకునేలా చేసింది.గీతు కావాలని చేస్తుందా లేక తను ఇంతేనా అన్నది పక్కన పెడితే గీతు రాయల్ ఈ సీజన్ లో మొదటి వారం వరస్ట్ పర్ఫార్మర్ గా జైలుకి వెళ్లింది.
అయితే ఈ వారం ఆమె నామినేషన్స్ లో కూడా లేకపోవడం వల్ల ఎలిమినేషన్ బాధ ఉండదు.అయితే గీతు మాత్రం తన ఆట ఇదే.నేను ఇలానే ఉంటానని హౌజ్ మెట్స్ కి ఛాలెంజ్ చేస్తుంది.మరి గీతు డేరింగ్ నెస్ ఆమెని టాప్ 5 దాకా తీసుకెళ్తుందా లేదా అన్నది చూడాలి.







