సౌత్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార గురించి పరిచయం అవసరం లేదు.సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గాకొనసాగుతున్న నయనతార కేవలం సినిమా షూటింగ్ పూర్తి అయ్యేవరకు మాత్రమే ఆ సినిమా పట్ల బాధ్యతగా ఉంటారు.
అనంతరం ఆమె సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొననని ముందుగానే నిర్మాతలతో అగ్రిమెంట్ కుదుర్చుకుంటారు.ఇలా నయనతార తాను నటించిన సినిమాలకు కూడా పెద్దగా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనరు.
అయితే తాజాగా ఈమె మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే.
మెగాస్టార్ తాజాగా నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఇక ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీ విడుదల కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నారు.ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నారంటూ వార్తలు వచ్చినప్పటికీ ఈ వార్తలపై ఎలాంటి స్పష్టత లేదని చెప్పాలి.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నయనతార పాల్గొనబోతుందని సమాచారం వినబడుతుంది.సాధారణంగా నయనతార హీరోయిన్ గా నటించిన సినిమాలకు కూడా హాజరు కారు అలాంటిది చెల్లెలి పాత్రలో నటించినటువంటి ఈ సినిమాకి ఎలా వస్తారనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.ఇక గాడ్ ఫాదర్ సినిమా దర్శకుడు మోహన్ రాజాతో నటి నయనతారకు ఎంతో మంచి బాండింగ్ ఉందని, ఈ అనుబంధంతోనే ఈమె ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
అదేవిధంగా నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ నుపెళ్లి చేసుకున్న తర్వాత ఒకసారి కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాలేదు.అయితే ఈ వేడుక ద్వారా తెలుగు ప్రేక్షకులను కలుసుకోవచ్చు అనే ఆలోచనలు ఉండటంవల్ల ఈమె ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హాజరవుతున్నారని వార్తలు వస్తున్నాయి.
మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.








