సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఆఫ్టర్ డైవర్స్ చాలా రూమర్స్ వచ్చాయి.అయితే ప్రతి విషయానికి క్లారిటీ ఇవ్వడానికి ఇబ్బంది పడి సమంత కూడా ఈమధ్య సోషల్ మీడియాకి దూరంగా ఉంటుంది.
ఈ క్రమంలో సమంత ఇక మీదట తన సినిమాల ద్వారానే తన మీద టార్గెట్ చేసిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అనుకుంటుంది.అందుకే కమర్షియల్ గా కాకుండా నటనా ప్రాధాన్యత ఉన్న పాత్రలతో ఆమె సందడి చేస్తుంది.
ఇప్పటికే గుణశేఖర్ శాకుంతలం, కొత్త దర్శకుడు హరి హరీష్ లతో యశోద సినిమా చేస్తున్న సమంత ఆ సినిమాల తర్వాత బాలీవుడ్ లో వరుస సినిమాలు ఓకే చేస్తుంది.అంతకుముందులా మీడియా ముందుకు పెద్దగా కనిపించడానికి ఇష్టపడని సమంత తన సినిమాలతోనే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని చూస్తుంది.
ఫ్యామిలీ మెన్ వెబ్ సీరీస్ తో బాలీవుడ్ ఆడియెన్స్ కు దగ్గరైన సమంత అక్కడ రెండు క్రేజీ వెబ్ సీరీస్ లతో సైన్ చేసినట్టు తెలుస్తుంది.ఈ సో ఈ లెక్కన సమంత పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటాలని ఫిక్స్ అయిందని చెప్పొచ్చు.
వరుస క్రేజీ ప్రాజెక్ట్ లతో పర్ఫెక్ట్ ప్లానింగ్ లో ఉంది సమంత.







