అమరావతిలో పేదలకు చోటు లేదా అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు.అమరావతి కోసం గుంటూరు, విజయవాడకు అన్యాయం చేశారన్నారు.
పాదయాత్ర అంటున్నారు.కానీ అది విశాఖపై దండయాత్రని విమర్శించారు.
అమరావతి రైతుల పాదయాత్రను ఉత్తరాంధ్ర ప్రజలు హర్షించరని పేర్కొన్నారు.పాదయాత్రలో శాంతిభద్రతలకు విఘాతం కలిగితే దానికి చంద్రబాబే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు అమరావతికి చేసింది ఏమి లేదన్న ఆయన.మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని స్పష్టం చేశారు.







