ఇదో అరుదైన జీవి.. దీని ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

శాస్త్రవేత్తలు చేసే ఎన్నో పరిశోధనలు ఆశ్చర్యకర విషయాలను వెల్లడిస్తున్నాయి.మనకు తెలియని ఎన్నో జీవుల గురించి, వాటి ప్రత్యేకతల గురించి తెలియజేస్తున్నారు.

 This Is A Rare Creature You Will Be Surprised If You Know Its Special Features ,-TeluguStop.com

మనకు తెలిసిన జీవుల్లో బల్లి, తొండ వంటివి తమ తోకను కోల్పోయినా, తిరిగి కొంత కాలానికి దానిని అవి పొందగలవు.మరే ఇతర జీవులకు తమ అవయవాలను పునరుత్పత్తి ఈ తరహాలో చేసుకోలేవని మనం అనుకుని ఉంటాం.

ఇక మనుషుల్లో అయితే కాలేయాన్ని కొంత భాగం తొలగించినా, తిరిగి పునరుత్పత్తి చేసుకోగల సామర్ధ్యం దానికి ఉంటుంది.అయితే శాస్త్రవేత్తలు అందరూ ఆశ్చర్యపోయే విషయం ఇటీవల బయటపడింది.

ఆక్సోలోట్ల్ (అంబిస్టోమా మెక్సికనమ్) అనే సాలమండర్ జీవికి పునరుత్పత్తి విషయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ఆక్సోలోట్ల్‌లకు వెన్నుపాము, గుండె, ఇతర అవయవాలను పునరుత్పత్తి చేసుకునే సామర్థ్యం ఉంది.ఈ ఉభయచరాలు తమ జీవితాంతం కొత్త న్యూరాన్‌లను కూడా తయారు చేస్తాయి.అంతేకాకుండా ఆక్సోలోట్ల్ మెదడు పునరుత్పత్తి అసలు కణజాల నిర్మాణాన్ని పునర్నిర్మించే పరిమిత సామర్థ్యాన్ని కలిగి ఉందని ఒక అధ్యయనం కనుగొంది.

Telugu Animal, Axolotl, Lizard, Creature, Rare Creature, Thonda-Latest News - Te

జ్యూరిచ్‌లోని ట్రూట్లీన్ ల్యాబ్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాలిక్యులర్ పాథాలజీలో పరిశోధకులు ఆక్సోలోట్‌లు వాటి మెదడులోని అన్ని విభిన్న కణ రకాలను పునరుత్పత్తి చేయగలవా అని తెలుసుకుని ఆశ్చర్యపోయారు.తాము ఆక్సోలోట్ల్ మెదడులో ఒక భాగాన్ని రూపొందించే కణాల అట్లాస్‌ను సృష్టించామని, ఇది పునరుత్పత్తి, జాతుల అంతటా మెదడు పరిణామం రెండింటిపై వెలుగునిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు.వారి పరిశోధనలు పూర్తి స్థాయిల విజయవంతం అయితే ఇది ఎన్నో ఆవిష్కరణలకు దారి తీస్తుంది.

ముఖ్యంగా అవయవాలను కోల్పోయిన వారికి, అయవయ మార్పిడి చేసుకోవాలనుకునే వారికి ఇది చక్కటి పరిష్కారం చూపుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube